Wednesday, October 9, 2024

నేపాల్‌లో వరదలకు 39 మంది మృతి

- Advertisement -
- Advertisement -

నేపాల్ లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలకు వరదలు సంభవించి ఎనిమిది జిల్లాల్లో దాదాపు 39 మంది మృతి చెందారు. 11 మంది గల్లంతయ్యారు. ఖాఠ్‌మాండ్‌లో తొమ్మిది మంది, లలిత్‌పూర్‌లో 16 మంది, భక్తపూర్‌లో ఐదుగురు, కవ్రెపలన్ చౌక్‌లో ముగ్గురు, పాంచ్‌థార్, థన్‌కూటల్లో చెరో ఇద్దరు ,జపా, ధాడింగ్‌లో చెరో ఒక్కొక్కరు మృతి చెందారు. ఖాఠ్‌మాండ్‌లో 226 ఇళ్లు వరదనీటిలో మునిగిపోయాయని, వరద బాధిత ప్రాంతాల్లో సహాయ చర్యలకు దాదాపు 3000 మంది భద్రతా దళాలను నియమించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News