Friday, May 3, 2024

శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

- Advertisement -
- Advertisement -

foreign currency Seized at Shamshabad Airport

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. ఎయిర్‌పోర్టులో అధికారులు ప్రయాణికుల లగేజీని సోమవారం రాత్రి సమయంలో తనిఖీ చేయగా షార్జాకు వెళ్తున్న ప్రయాణికుడి వద్ద విదేశీ కరెన్సీ గుర్తించారు. ప్రయాణికుడు నసీర్(24) నుంచి రూ.34.49 లక్షలు స్వాధీనం చేసుకున్న సిఐఎస్‌ఎఫ్ ఇంటిలిజెన్స్ అధికారులు అతడిని కస్టమ్స్‌కు అప్పగించారు. హైదరాబాద్ నుండి షార్జా వెళ్తున్న మహమ్మద్ నజీర్ అనే వ్యక్తి అనుమానస్పదంగా తిరుగాడుతుండటంతో సిఐఎస్‌ఎఫ్ సెక్యూరిటీ అధికారులు అదుపులోకి తీసుకుని అతని చెక్ చేయగా అందులో అక్రమంగా తరలిస్తున్న సౌది రియాల్ బయపడింది. కరెన్సీని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుడిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News