Monday, April 29, 2024

ముగిసిన ఎపి సిఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన

- Advertisement -
- Advertisement -

AP CM YS Jagan Delhi Tour End

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. మంగళవారం పలువురు కేంద్రమంత్రులతో సిఎం భేటీ అయ్యారు. కేంద్ర రవాణా మంత్రి గడ్కరీతో సమావేశమైన సిఎం జగన్ విశాఖ నుంచి భోగాపురం వరకు జాతీయ రహదారి ఏర్పాటుపై చర్చించడంతో పాటు రాష్ట్రంలో పలు జాతీయ రహదారులను మంజూరు చేసినందుకు సిఎం జగన్ ధన్యవాదాలు తెలిపారు. విశాఖపట్నం పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకూ జాతీయ రహదారి డిపిఆర్ తయారీ అంశంపై చర్చించారు. విశాఖపట్నానికి ఈ రహదారి చాలా ఉపయోగమని, విశాఖపట్నం పోర్టు నుంచి ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వెళ్లే సరుకు రవాణా వాహనాలకు తక్కువ దూరం అవుతుందని కేంద్ర మంత్రికి తెలిపారు. విశాఖ నగరంలో వాహన రద్దీని దృష్టిలో ఉంచుకుని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 6 లేన్ల రహదారిని మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని సిఎం జగన్ కోరారు.అలాగే కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్, ధర్మేంద్ర ప్రధాన్‌ను సిఎం కలిశారు. కేంద్ర సమాచార, క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో భేటీ నిర్వహించి ఎపిలోని క్రీడా మైదానాల అభివృద్ధి సహా పలు అంశాలపై చర్చించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News