Tuesday, April 30, 2024

బీజేపీలోకి మాజీ బీజేడీ ఎంపి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మాజీ బీజేడీ (బిజూ జనతాదళ్) ఎంపి ప్రభాస్ కుమార్ సింగ్ సోమవారం బీజేపీలో చేరారు. లోక్‌సభ ఎన్నికలు కొద్దిరోజులుండగా పార్టీ ఫిరాయించడం విశేషం. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వాన్ని ఆయన ప్రశంసిస్తూ, ఒడిశా ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ నడిపే బీజేడీని తీవ్రంగా విమర్శించారు. ఆ పార్టీలో హోదా, ఆత్మగౌరవం లేదని విమర్శించారు. ఆ పార్టీలో ఒడియా అస్తిత్వం,సంస్కృతి వారసత్వం కరువైందని, ఒడిశా లోని బర్గాడ్ స్థానానికి గతంలో ప్రాతినిధ్యం వహించిన ప్రభాస్ కుమార్ సింగ్‌కు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ తరుణ్ చుగా, ఇతర బీజేపీ సీనియర్ నేతలు స్వాగతం పలికారు.

ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ నేతలతో కలిసి ఆయన పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన బీజేపీలో చేరడం తనకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అత్యంత ప్రజాదరణ కలిగిన మోడీ వ్యక్తిత్వానికి తాను ప్రభావితమయ్యానని ప్రభాస్ చెప్పారు. గత పదేళ్లుగా మోడీ నాయకత్వంలో సమాజంలోని వివిధ వర్గాలకు, యువత, మహిళలకు , రైతులు, పేదలకు వివిధ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News