Saturday, April 27, 2024

మాజీ సిఎం కెసిఆర్ తుంటి మార్పిడి సర్జరీ సక్సెస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ మాజీ సిఎం, బిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్‌కు సర్జరీ సక్సెస్ అయింది. సోమాజీగూడలోని యశోద హాస్పిటల్ వైద్యులు మాజీ సిఎం కెసిఆర్‌కు హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. శుక్రవారం సాయంత్రం ప్రారంభమైన తుంటి ఎముక మార్పిడి సర్జరీ రాత్రికి పూర్తియింది. సర్జరీ పూర్తయిన అనంతరం కెసిఆర్‌ను ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసియుకి తరలించారు. పార్టీ అధినేతకు సర్జరీ సక్సెస్ అయిందని తెలియగానే బిఆర్‌ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. త్వరలోనే కెసిఆర్ కోలుకుని తమ మధ్యకు వస్తాడన్నారు. కెసిఆర్ సతీమణి శోభ కుమారుడు కెటిఆర్, కుమార్తె కవిత, హరీష్ రావు, సంతోష్ తదితరులు యశోద హాస్పిటల్ లో ఉండి కెసిఆర్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు. ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌లో కెసిఆర్ బాత్‌రూమ్‌లో కాలు జారిపడిపోయారు. ఘటన జరిగిన వెంటనే ఆయన్ని యశోద హాస్పిటల్‌కు తరలించారు.

అర్థరాత్రి రెండున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. కెసిఆర్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిపై తనకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని వైద్య,ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు. కెసిఆర్‌కు మెరుగైన వైద్య సహాయం అందించాలని వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వికి సూచించారు. సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు యశోద హాస్పిటల్‌కు వైద్య, ఆరోగ్య శాఖ సెక్రటరీ రిజ్వీ వెళ్లారు. యశోద ఆసుపత్రి వైద్యులను అడిగి కెసిఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆయన తెలుసుకున్నారు. కెసిఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని హెల్త్ సెక్రటరీకి యశోద ఆసుపత్రి వైద్యులు వివరించారు. కెసిఆర్‌కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని రిజ్వి ఆసుపత్రి వర్గాలకు తెలిపారు. కెసిఆర్ బాత్రూంలో జారిపడిన విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియరెన్స్‌తో కెసిఆర్‌ను గురువారం అర్ధరాత్రి ఆసుపత్రికి పోలీసులు తీసుకువచ్చారు.

ఆయనను పరీక్షించిన తర్వాత యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. బాత్రూంలో జారిపడడంతో ఆయన ఎడమ తుంటికి ఫ్రాక్చర్ అయిందని వైద్యులు ప్రకటించారు. ఈ గాయం నుండి కోలుకోవడానికి ఆయనకు ఆరు నుండి ఎనిమిది వారాల సమయం పడుతుందని యశోద ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే ఆయనకు సిటి స్కాన్‌తో పాటు ఎడమ తుంటికి శస్త్ర చికిత్స చేసేందుకు అవసరమైన పరీక్షలు నిర్వహించారు. అనంతరం కెసిఆర్‌కు డాక్టర్లు హిప్ రీప్లేస్‌మెంట్ ఆపరేషన్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News