Thursday, February 29, 2024

నీటి ప్రవాహంతో కొట్టుకపోయిన గుండ్లకమ్మ జలాశయం రెండో గేటు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో కురుసున్న వానలకు నీటి ప్రవాహాం పెరగడంతో కందులు ఓబుల్‌రెడ్డి గుండ్లకమ్మ జలాశయం రెండవ గేటు మరోసారి కొట్టుకపోయింది. గత ఏడాది సెప్టెంబర్‌లో వరద నీరు ముంచెత్తడంతో మూడవ కొట్టుకపోగా మరో రెండు గేట్లు లీకైయ్యాయి. గత ఏడాది ఈజలాశయం సమస్య రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదంగా మారి ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. అయిన ప్రభుత్వం నేటికి మూడవ గేటును పూర్తి స్దాయిలో అమర్చలేదు.

దీంతో ప్రాజెక్టు నీరు సముద్రంలోకి ప్రవహిస్తుండటంతో మాజీ సిఎం చంద్రబాబు నాయుడు పరిశీలనకు వెళ్లడంతో ఆగమేఘాల మీద తాత్కాలిక గేటు అమర్చి చేతులు దులుపుకుంది. నేటికి ప్రాజెక్టు నుంచి నీరు వృధాగా పోతుంది. శుక్రవారం మరో గేటు కొట్టుకపోవడంతో సమాచారం తెలుసుకున్న వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టు వద్దకు వెళ్లి పరిస్ధితులను సమీక్షిస్తున్నారు. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలు ముంపుకు గురైతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News