Thursday, March 23, 2023

చరిత్ర సృష్టిద్దాం: నాగ్ ట్వీట్

- Advertisement -

హైదరాబాద్: ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తున్న మంత్రి కెటిఆర్ హీరో నాగార్జున ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. హుస్సేన్ సాగర్ తీరంలో ఫిబ్రవరి 11వ తేదీన చరిత్ర సృష్టిద్దాం అని నాగ్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. తెలంగాణ గడ్డ మీద మరికొద్ది రోజుల్లో అంతర్జాతీయ ఫార్ములా- ఈ రేస్ హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరాన జరుగునుంది. దీంతో, టాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖుల సుంచి మంత్రి కెటిఆర్‌కు, హెచ్‌ఎండీఏకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా హీరో నాగార్జున ట్విట్టర్ వేదికగా కెటిఆర్‌కు కంగ్రాట్స్ తెలుపుతూ నాగ్ ట్విట్టర్లో వీడియో పెట్టారు. నాగార్జున ట్విట్‌కు మంత్రి కెటిఆర్ రీ-ట్వీట్ చేశారు. ‘నెట్ జీరో స్పోర్ట్ ఫార్ములా ఈ’ను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నందుకు కెటిఆర్, తెలంగాణ సీఎంఓ, హెచ్‌ఎండిఏ, అనిల్ చలమలశెట్టికి అభినందనలు. ‘హుస్సేన్‌సాగర్ తీరంలో ఫిబ్రవరి 11న చరిత్ర సృష్టిద్దాం’ అని నాగార్జున ట్విట్టర్ పోస్టుకు క్యాప్షన్ రాసుకొచ్చారు.
‘లెట్ ది రేస్ ఈస్ బిగిన్’
‘అందరికీ నమస్కారం.. ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్ భారతదేశానికి, ముఖ్యంగా హైదరాబాద్‌కు తీసుకొచ్చినందుకు కెటిఆర్, అనిల్ చలమలశెట్టిలకు అభినందనలు తెలియజేస్తున్నా. ఫిబ్రవరి 11న గ్రీన్‌కో హైదరాబాద్ ఈప్రిక్స్ వద్ద మీ అందరినీ చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచుస్తున్నా. ‘లెట్ ది రేస్ ఈస్ బిగిన్’ అని నాగార్జున పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈరేసుకు సంబంధించిన టికెట్లను ఇప్పటికే బుక్‌మై షోలో అమ్మకానికి పెట్టారు.
11 దేశాల నుంచి 22 మంది
ఫిబ్రవరి 11న జరగబోయే ఫార్ములా ఈ రేస్‌కు సన్నద్ధంగా ఫిబ్రవరి 10వ తేదీన ప్రాక్టీస్ రేసింగ్ నిర్వహించనున్నారు. ఈ రేస్‌లో 11 దేశాల నుంచి మొత్తం 22 మంది డ్రైవర్లు పాల్గొంటున్నారు. రేస్ నిర్వహణ కోసం హుస్సేన్ సాగర్ తీరాన 18 మలుపులతో 2.8 కిలోమీటర్ల పొడవైన ట్రాక్‌ను ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News