Saturday, April 20, 2024

పాకిస్థాన్ కరెన్సీ భారీ పతనం

- Advertisement -
- Advertisement -

కరాచీ: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ కరెన్సీ విలువ శుక్రవారం భారీగా పతనమైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి బహిరంగ మార్కెట్లో రూ.262.6కి పడిపోయింది. ఒక దశలో ఓపెన్ మార్కెట్లో యూఎస్ డాలరుతో పోలిస్తే రూ.265కు, ఇంటర్‌బ్యాంకులో రూ.266కు పాక్ కరెన్సీ క్షీణించింది.

అనంతరం మార్కెట్ ముగిసేనాటికి స్వల్పంగా కోలుకుని రూ.262.6కు చేరుకుందని ఆఫ్ పాకిస్థాన్ తెలిపింది. ఎస్‌బిపి తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం మార్కెట్ ప్రారంభమవగానే పాక్ కరెన్సీ పోలిస్తే రూ.7.17 (2.73) శాతం క్షీణించింది. 1999నాటితో పోలిస్తే గురువారం నాటికి రూపాయి విలువ రూ.34 తగ్గింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) రుణ కార్యక్రమం పునరుద్ధరించి యూఎస్‌డిపికేఆర్ మారకరేటును తొలగించిన తరువాత పాకిస్థాన్ రూపాయి విలువ అత్యంత వేగంగా క్షీణిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News