Monday, April 22, 2024

పట్టాలు తప్పిన సబర్మతి రైలు

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్ లోని అజ్మీర్ స్టేషన్ సమీపంలో సోమవారం సబర్మతిఆగ్రా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఆగ్రా వైపు వెళ్తున్న ఈ ఎక్స్‌ప్రెస్ రైలు అజ్మీర్ స్టేషన్ దాటుకుని మాదర్ స్టేషన్‌ను చేరబోతున్న సమయంలో సోమవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. నాలుగు బోగీలు పట్టాలు తప్పడానికి కారణాలు ఇంకా తెలియలేదని నార్త్ వెస్టర్న్ రైల్వే (ఎన్‌డబ్లుఆర్) జోన్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శశికిరణ్ చెప్పారు. ఈ రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల బంధువుల సహాయం కోసం అజ్మీర్ స్టేషన్ వద్ద హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. ఈ రూటులో ఆరు రైళ్లను రద్దు చేశారు. రెండు రైళ్లను మరో రూటుకు మళ్లించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News