Saturday, October 12, 2024

కూలీల ప్రాణాలు తీసిన విద్యుత్ తీగలు

- Advertisement -
- Advertisement -

ముంబయి: వ్యవసాయ పొలంలో నాట్లు వేసేందుకు వెళ్లిన కూలీలను విద్యుత్ తీగలు పొట్టన పెట్టుకున్నాయి. ఈ సంఘటన మహారాష్ట్రాలోని చంద్రపూర్ జిల్లా బ్రహ్మపూరి తాలూకాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గణేశ్‌పూర్ గ్రామానికి చెందిన యువరాజ్ డొంగరే(43), ప్రకాశ్ రవూత్(65), నానాజీ రవూత్(55), చిచ్‌కేడా గ్రామానికి చెందిన పుండలీక్ మాన్‌కర్(65) అనే వ్యక్తులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం ఉదయం గణేశ్‌పూర్ శివారులోని ఓ రైతు పొలంలో వరి నాట్లు వేసి సాయంత్రం ఇంటికి వెళ్తుండగా వారిపై విద్యుత్ తీగ పడింది. దీంతో వారు ఘటనా స్థలంలో చనిపోయారు. స్థానికుల సమాచారం మేరకు కరెంట్ సరఫరాను విద్యుత్ సిబ్బంది నిలిపివేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  గణేశ్ పూర్, చిచ్ కేడా గ్రామాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News