Tuesday, October 15, 2024

విల్లు, బాణాలతో వారియర్‌గా..

- Advertisement -
- Advertisement -

హీరో నిఖిల్ మోస్ట్ ఎవైటెడ్ పాన్ -ఇండియా ప్రాజెక్ట్ ‘స్వయంభూ’. టాలెంటెడ్ భరత్ కృష్ణమాచారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిఖిల్ 20వ మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లెజండరీ వారియర్ గా కనిపించనున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హై పీరియాడిక్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ మూవీలో నిఖిల్ సరసన సంయుక్త, నభా నటేష్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. బుధవారం సంయుక్త బర్త్ డే సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. సంయుక్త ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విల్లు, బాణాలు పట్టుకుని వారియర్‌గా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మోడరన్ అమ్మాయి లుక్‌లో…
యాక్షన్- హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ #బిఎస్‌ఎస్12, ఆయన పరిశ్రమలోకి అడుగుపెట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపధ్యంలో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తోంది. ఈ చిత్రానికి డెబ్యూటెంట్ లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, మూన్‌షైన్ పిక్చర్స్‌పై మహేష్ చందు నిర్మిస్తున్నారు. 400 ఏళ్ల నాటి గుడి నేపధ్యంలో కల్ట్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో సంయుక్త ఫీమేల్ లీడ్ లో నటిస్తున్నారు. ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ సంయుక్త పాత్రను సమీరాగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. గ్లాస్ షెల్ఫ్‌లపై రకరకాల నిర్మాణాలు కనిపిస్తుండగా, ఇంటెన్స్ లుక్స్‌తో కూడిన మోడరన్ అమ్మాయి లుక్‌లో సంయుక్త అద్భుతంగా కనిపించింది.
శాస్త్రీయ నృత్యం చేస్తూ…
చార్మింగ్ స్టార్ శర్వానంద్ 37వ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సామజవరగమనతో బ్లాక్ బస్టర్ అందించిన రామ్ అబ్బరాజు దర్శకత్వంలో అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిలేరియస్ రైడ్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో శర్వానంద్ కు జోడిగా సాక్షి వైద్య, సంయుక్త హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంయుక్త పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ, పోస్టర్ ద్వారా ఆమె పాత్రను దియాగా పరిచయం చేశారు మేకర్స్. సంయుక్త సంప్రదాయ శాస్త్రీయ నృత్యం చేస్తూ కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News