Saturday, October 12, 2024

సాగర్ కాలువలో పడి నలుగురు గల్లంతు

- Advertisement -
- Advertisement -

జైల్‌లోని మిత్రుడిని కలిసేందుకు వచ్చి మృత్యువు ఒడిలోకి
ఒకరి మృతదేహం లభ్యం
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగరంలో దానవాయిగూడెం సమీపంలోని సాగర్ కాలువలో నలుగురు వ్యక్తులు గల్లంతు అయ్యారు. వీరిలో ఒక యువకుడి మృతదేహం లభ్యం అయ్యింది మిగిలిన ముగ్గురు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.వివరాలకు వెళ్ళితే మణుగూరు పట్టణానికి చెందిన రాము అనే వ్యక్తి ఖమ్మం రూరల్ మండలం దానవాయిగూడెం జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. రాముకు పరిచయస్తులైన మణుగూరు పట్టణంలో బాపన కుంట చెం దిన నలుగురు రొండ వెంకటేశ్వర్లు (33), చల్లా రమేష్ (38), ప్రసా ద్(27), బండారు భరత్ (30) సోమవారం మధ్యాహ్నం ములాఖత్ పై చూసేందుకు జిల్లా జైల్ వద్దకు ఆటోలో వచ్చారు.

అతనిని చూసి మాట్లాడిన అనంతరం ఖమ్మం నగరంలో ప్రకాశ్ నగర్ లో నివాసం ఉంటున్న రొండ వెంకటేశ్వర్లు బంధువు పిట్టల శ్రీనివాస్ ఇంటికి వెళ్లారు. అక్కడ అందరూ కలిసి మద్యం సేవించారు. సోమవారం అర్ధరాత్రి దానవాయిగూడెం లో ఉన్న చల్ల రమేష్ అన్న కుమారుడు శ్రీహరి ఇంటి కి వచ్చారు. అక్కడ కూడా మద్యం సేవించారు.

అనంతరం ఇంటికి వెళ్తున్నామని చెప్పి బయలుదేరి దానవాయిగూడెం ఎన్‌ఎస్పీ కెనాల్ వద్దకు చేరుకున్నారు. కాల్వకట్ట పక్కన ఆటో ను నిలిపారు. రొండ వెంకటేశ్వ ర్లు ఆటోలో నిద్రిస్తుండగా మిగిలిన ముగ్గురు చల్లా రమేష్, ప్రసాద్, బం డారు భరత్ మెట్లెక్కి కాల్వపైకి వెళ్లారు. స్నానం చేసేందుకు కాల్వలో దిగారు. మద్యంమత్తులో ముగ్గురు కొట్టుకొని పోయారు. . ఖమ్మం టౌన్ ఏసిపి రమణమూర్తి ఆధ్వర్యంలో గజ ఇతగాళ్లతో గాలింపు చేపట్టగా బండారు భరత్ మృతదేహం లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News