Saturday, October 12, 2024

రాణించిన రహానె, సర్ఫరాజ్

- Advertisement -
- Advertisement -

ముంబై 237/4, రెస్ట్‌తో ఇరానీ సమరం

లక్నో: ప్రతిష్ఠాత్మకమైన ఇరానీ ట్రోఫీలో ముంబై టీమ్ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. లక్నోలోని ఎకానా స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబైకి ఆరంభంలోనే కోలుకోలేని షాక్ తగిలింది. ఓపెనర్ పృథ్వీ షా 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన హార్దిక్ తామోర్ (0) ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. కొద్ది సేపట్టికే ఓపెనర్ ఆయూష్ మాత్రే కూడా వెనుదిరిగాడు.

ఆయూష్ 19 పరుగులు చేశాడు. ఈ మూడు వికెట్లు కూడా ముకేశ్ కుమార్‌కే దక్కాయి. 37 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న ముంబైను ఆజింక్య రహానె, శ్రేయస్ అయ్యర్‌లు ఆదుకున్నారు. కీలక ఇన్నింగ్స్ ఆడిన అయ్యర్ ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 57 పరుగలు చేశాడు. మరోవైపు కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో అలరించిన రహానె ఆరు ఫోర్లు ఒక సిక్స్‌తో 86 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. అతనికి యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అండగా నిలిచాడు. సర్ఫరాజ్ ఆరు ఫోర్లతో 50 పరుగులు చేసి క్రీజులో నిలిచాడు. దీంతో ముంబై స్కోరు 237 పరుగులకు చేరింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News