Tuesday, May 30, 2023

వికటించిన కు.ని ఆపరేషన్లు.. దర్యాప్తునకు నిపుణుల కమిటీ

- Advertisement -
- Advertisement -

నాలుగుకు పెరిగిన మృతుల సంఖ్య
మృతుల కుటుంబాలకు
రూ.5 లక్షలు పరిహారం
డబుల్ బెడ్‌రూం ఇల్లు, పిల్లల
చదువు బాధ్యత ప్రభుత్వానిదే
శస్త్రచికిత్స చేసిన వైద్యుడి
లైసెన్స్ తాత్కాలికంగా రద్దు
ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను
సస్పెండ్ చేశాం
రాష్ట్ర ప్రజాసంచాలకులు
డాక్టర్ శ్రీనివాసరావు
ఘటనపై హెచ్‌ఆర్‌సి సీరియస్

మనతెలంగాణ/హైదరాబాద్ : కేంద్రమార్గదర్శకాల ప్రకారమే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించినా నలుగురు మహిళలు మరణించడం దురదృష్టకరమని రాష్ట్ర ప్రజాసంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు అన్నారు. మృతు ల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మహిళలు మృతి చెందిన ఘటనపై మంగళశా రం డీహెచ్ మీడియాతో మాట్లాడారు. శస్త్రచికిత్స చేసిన వైద్యుడి లైసెన్స్‌ను తాత్కాలికంగా రద్దు చేసి సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. ఇబ్రహీంపట్నం ఆసుపత్రి సూపరింటెండెంట్ ను సస్పెండ్ చేసినట్లు తెలిపారు. ఇబ్రహీంప ట్నం సామాజిక ఆరోగ్య కేంద్రం ఘటనలో దర్యాప్తునకు ప్రత్యేక కమిటీని నియమించినట్లు చెప్పారు. ఈ ఘటనలో మరణించిన వారి కు టుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందిచనున్నట్లు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు డబుల్ బెడ్‌రూం ఇల్లు మంజూరు చేయడంతో పాటు వారి పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు.ఈ నెల 25న ఇబ్రహీంపట్నం పరిధిలో 34 మందికి డబుల్ పంచర్ లాప్రోస్కోపి నిర్వహించామని డీహెచ్ తెలిపారు. కుటుంబ నియంత్రణకు సంబంధించి దేశవ్యాప్తంగా డీబీఎల్ అనేది అ డ్వాన్స్ మెథడ్ అని చెప్పారు.

ఇబ్రహీంపట్నం లో మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని.. 34 మందికి ఈ ఆపరేషన్ చేస్తే దురదృష్టవశాత్తు అందులో నలుగురు మరణించారని డీహెచ్ వెల్లడించారు. నలుగురు మహిళలు త మకు గ్యాస్ట్రో లక్షణాలున్నట్లు చెప్పారని అన్నా రు. తగిన చికిత్స అందించినా నలుగురు చనిపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల పోస్టుమార్టం నివేదిక వచ్చాకే వారి మరణానికి గల కారణం తెలుస్తుందని అన్నారు. కేంద్రం ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారమే ఆపరేషన్లు నిర్వహించినట్లు స్పష్టం చేశారు. ఇకపై శస్త్రచికిత్స సమయంలో కచ్చితమైన నిబంధనలు అమలు చేసేలా జాగ్రత్తపడతామని చెప్పారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్న 30 మంది ఇళ్లకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.

అందులో ఏడుగురికి పలు ఆరోగ్య సమస్యలు గుర్తించి వారిని అపోలో ఆస్పత్రికి తరలించామని చెప్పారు. మంగళవారం మరోసారి పరీక్షలు చేసి ఇద్దరిని నిమ్స్‌కు తరలించామని పేర్కొన్నారు. మిగతా అందరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని అన్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. 2016 నుంచి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల టార్గెట్లు లేవని, ప్రజలు స్వఛ్చందంగా ముందుకు వస్తున్నారని తెలిపారు. 2020 21లో 1.10 లక్షల ఆపరేషన్ నిర్వహించామని, ఈ ఏడాది ఏప్రిల్ నుంఇచ జులై వరకు 111 క్యాంపుల్లో 38,656 సర్జరీలు చేసినట్లు చెప్పారు. ఈ ఘటనపై దర్యాప్తునకు ప్రభుత్వం నలుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిందని, ఈ కమిటీ అన్ని అంశాలను పరిశీలించి ఏడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని తెలిపారు. మరణాలకు కారణం ఏమిటో పరిశోధన తర్వాతనే తెలుస్తుందని అన్నారు.

నాలుగుకు పెరిగిన మృతుల సంఖ్య

మన తెలంగాణ/ఇబ్రహీంపట్నం: ఫ్యామిలీ ప్లానింగ్‌లో భాగంగా ఆపరేషన్‌లు చేయించుకున్న మహిళలు మృత్యువాత పడటం సంచలనం రేకెత్తించింది. రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు మృత్యువాత పడగా.. మంగళవారం మరో మహిళ ప్రాణాలొదిలింది. దీంతో మృతిచెందిన మహిళల సంఖ్య నలుగురికి చేరింది. ఈ హృదయ విదారక సంఘటన ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రి పరిధిలో చోటుచేసుకుంది. ఈనెల 25న ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో సుమారు 34 మంది మహిళలకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు నిర్వహించారు. మంచాల, ఇబ్రహీంపట్నం, యాచారం, మాడ్గుల మండలాలకు చెందిన ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల నుండి మహిళలు ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకున్నారు. రెండ్రోజుల అనంతరం వారిలో నలుగురికి అస్వస్తత తలెత్తడంతో వారి కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందించారు.

ఈక్రమంలో సోమవారం మాడ్గుల మండలం నర్సాయపల్లికి చెందిన నర్సింగ్ మమత(22), మంచాల మండలం లింగంపల్లికి చెందిన సుష్మ(32), ఇబ్రహీంపట్నం పరిధిలోని సీతారాంపేట్‌కు చెందిన లావణ్య(26), మాడ్గుల మండలం కొలుకులపల్లి తండాకు చెందిన మౌనికలు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. కాగా ఆదివారం సుష్మ, సోమవారం మమత, మౌనికలు కన్నుమూశారు. మంగళవారం లావణ్య సైతం పరిస్థితి విషమించడంతో మృతిచెందింది. ఈ వరుస ఘటనలతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనతో ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాలతో ఆర్‌డివోతోపాటు వైద్యారోగ్యశాఖ అధికారులు మృతుల కుటుంబ సభ్యులతో చర్చించి వారికి ఎక్స్‌గ్రేషియాను అందించేందుకు ముందుకువచ్చారు.

ఇబ్రహీంపట్నం ఘటనపై హెచ్‌ఆర్‌సి సీరియస్

మనతెలంగాణ/హైదరాబాద్ ః రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు విఫలమై నలుగురు మహిళలు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు విఫలమై నలుగురు మహిళలు మృతి చెందారని మరికొందరి పరిస్థితి విషమంగా ఉందంటూ మీడియాలో ప్రచురితమైన వార్తల ఆధారంగా హెఆర్‌సి సుమోటోగా కేసును స్వీకరించింది. ఈ ఘటనకు దారితీసిన కారణాలు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై తీసుకున్న చర్యలకు సంబంధించి అక్టోబర్10 నాటికి సమగ్ర నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను హెచ్‌ఆర్‌సి ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News