Friday, March 1, 2024

బోరుబావిలో పడిన నాలుగేళ్ల బాలిక

- Advertisement -
- Advertisement -

రాజ్‌గఢ్: మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో మంగళవారం సాయంత్రం ఒక నాలుగేళ్ల బాలిక తెరచి ఉన్న బోరుబావిలో పడిపోయింది. ఆ బాలికను రక్షించి బయటకు తీసుకువచ్చేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు సాగుతున్నాయి. బోడా పోలిసు స్టేషన్ పరిధిలోని పిప్లియా రసోడా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు జిల్లా ఎసఫి ధరమ్‌రాజ్ మీనా తెలిపారు. రాష్ట్ర విపత్తు నివారణ దళం(ఎస్‌డిఇఆర్‌ఎఫ్) ఘటనా స్థలానికి చేరుకుని బోరుబావిలో చిక్కుకున్న బాలికకు ఆక్సిజన్ అందేలా చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.

స్థానిక పాలనా యంత్రాంగంతో తాను చర్చలు జరిపినట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎక్స్ వేదికగా తెలిపారు. బోరుబావిలో నుంచి బాలికను సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ఎస్‌డిఇఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్, జిల్లా యంత్రాంగం ప్రయతిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బాలికను క్షేమంగా బయటకు తెచ్చేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని ఆయన తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News