Wednesday, May 1, 2024

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లక్ష్యంగా ఈడీ దాడులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగే లక్ష్యంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారం రాజస్థాన్, హర్యానాల్లో దాడులు ప్రారంభించింది. ఈ గ్యాంగ్‌పై మనీలాండరింగ్ కేసు నమోదై ఉండడంతో దర్యాప్తులో భాగంగా రెండు రాష్ట్రాల్లోని దాదాపు డజనుకు పైగా ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించింది. లారెన్స్‌బిష్ణోయ్, అతని సహచరుడు గోల్డీ బ్రార్‌పై కొన్నాళ్ల క్రితం ఎన్‌ఐఎ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం లారెన్స్ బైష్ణోయ్ జైలులో ఉన్నాడు.

అతడి గ్యాంగ్ సభ్యులు భారత్‌లో భారీగా బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. మాదకద్రవ్యాల, ఆయుధాల అక్రమ రవాణా సాగిస్తున్నారు. ఈ విధంగా వచ్చిన సొమ్ము కెనడా తదితర దేశాలకు తరలిస్తున్నారు. పంజాబ్ లోని ఫాజిల్కా జిల్లాకు చెందిన బిష్ణోయ్ 2014లో రాజస్థాన్ పోలీస్‌లకు దొరికాడు. అప్పటినుంచి జైల్లోనే ఉన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News