Saturday, July 27, 2024

నిరుద్యోగ యువతకు సిసిటివి, ఫైర్‌ అలారం కోర్సులో ఉచిత శిక్షణ

- Advertisement -
- Advertisement -

Free training on CCTV

 

హైదరాబాద్ : జిల్లాలో నిరుద్యోగ యువతకు సిసిటివి, ఫైర్‌ అలారం, బర్గ్‌లర్ అలారం కోర్సులో 45 రోజుల పాటు నైపుణ్యాభివృద్దిలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు వెనకబడిన తరగతుల అభివృద్ది విభాగం పేర్కొంది. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ, ఈశిక్షణలో చేరే యువకులు 10వ తరగతి ఉత్తీర్ణులై 18 నుంచి 40 సంవత్సరాల వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల అభ్యర్ధుల విద్యార్హత పత్రాలతో పాటు బయోడేటా, కులం, ఆదాయం, నివాస దృవీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, రెండు పాస్‌పోర్టుసైజ్ పోటోలతో గోల్నాక, అంబర్‌పేట కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు.

 

Free training on CCTV and fire alarm course
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News