Sunday, June 4, 2023

ఇంటివద్ద “అలెక్సా” తో పిల్లలకు భలే కాలక్షేపం

- Advertisement -
- Advertisement -

స్కూళ్లకు వేసవి శెలవులు రావడంతో పిల్లలు ఇంటి దగ్గరే గడుపుతున్నారు. ఇదివరకు ఆటస్థలాలకు వెళ్లి ఆటపాటలతో గడిపే వారు. కానీ ఇప్పుడు టీవీల ముందు, లేదా స్మార్ట్‌ఫోన్ల యాప్‌లతో గడుపుతున్నారు. టీవీ కానీ, మొబైల్ కానీ స్క్రీన్లు అదే పనిగా చూడడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ నేపథ్యంలో డిజిటల్ వాయిస్ అసిస్టెండ్ డివైజ్‌లపై పిల్లల మక్కువ పెరుగుతోంది. తల్లిదండ్రులు ఈ వేసవి శెలవుల్లో పిల్లలు ఇంగ్లీష్‌లో మాట్లాడడం, నీతి కథలను వినడం, డ్యాన్సు, పాటలు పాటడం, మ్యూజికల్ సాథనాలు నేర్చుకోవడం, హస్తకళలు వంటివి నేర్పించడానికి మొగ్గు చూపుతున్నారు.

ఈ పరిస్థితుల్లో అమెజాన్ అలెక్సా వినియోగం పిల్లలకు ఎంతో ఉపయోగపడుతోందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నట్టు ఒక సర్వేలో తేలింది. అమెజాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సర్వేలో 95 శాతం మంది తల్లిదండ్రులు ఇంటివద్ద అలెక్సా వినియోగిస్తుండడం తమ పిల్లల కమ్యూనికేషన్ నైపుణ్యం పెరుగుతున్నట్టు చెప్పారు. 90 శాతం తల్లిదండ్రులు తమ పిల్లలు మానసికంగా చురుకుగా ఉంటున్నారని తెలియజేశారు. కొత్త విషయాలు నేర్చుకోడానికి , స్వతంత్రంగా తమ పరిజ్ఞానాన్ని పెంచుకోడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. దాదాపు 10 నగరాల్లో 750 మంది తల్లిదండ్రులను 3 నుంచి 8 ఏళ్ల పిల్లలతో ఈ సర్వేలో అధ్యయనం చేశారు.

సర్వేలో పాల్గొన్నవారంతా అలెక్సా వినియోగదారులే. అలెక్సా స్మార్ట్ స్పీకర్లను వీరు వినియోగిస్తున్నారు. దాదాపు 96 శాతం మంది తల్లిదండ్రులు స్క్రీన్‌తో నిమిత్తం లేని డివైస్‌లనే తమ పిల్లలకు ఇస్తున్నారు. నేర్చుకునే తపన పెరిగి, క్రియాశీలత, సృజనాత్మకత బాగా అలవడడానికి స్క్రీన్ లేని ఉపకరణాలే మేలు చేస్తాయని వీరు భావిస్తున్నారు. వాయిస్ కంట్రోల్డ్ స్మార్ట్ స్పీకర్ వల్ల పిల్లల్లో ఆసక్తి, దృష్టి కేంద్రీకరణ, కమ్యూనికేషన్ (సమాచార నైపుణ్యం )స్కిల్స్ విస్తరిస్తాయన్న అభిప్రాయం తల్లిదండ్రుల్లో బాగా ఉంటోంది. తల్లిదండ్రులు తమ పిల్లలతో అలెక్సా వినియోగంలో పాలు పంచుకుంటున్నారు. క్రీడలు నుంచి బీర్బల్ , అక్బర్ కథల వరకు వారికి అలెక్సా నుంచి సమాచారం లభిస్తోంది. దీనికి తోడు అలెక్సాను ప్రశ్నించడం, సమాధానాలు రాబట్టడంతో వారి సంభాషణ చాతుర్యం పెరుగుతోందని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. గణితం కూడా అలవడుతోంది. చిక్కు ప్రశ్నలు, పజిల్స్ ఒకటేమిటి ? అనేక విషయాలు తెలుసుకోడానికి వీలవుతోంది.

అలెక్సా అంటే ఏమిటో తెలుసా?
ఇప్పటి డిజిటల్ యుగంలో డిజిటల్ వాయిస్ అసిస్టెంట్ డివైజ్‌లపై ప్రజలు ఎక్కువగా ఆధారపడుతున్నారు. అలెక్సా, అమెజాన్ ఏకో, గూగుల్ హోమ్ వంటివి ఇప్పటికే చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ వాయిస్ అసిస్టెంట్ టెక్నాలజీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు వాడుకలో ఉన్న డివైజ్‌లు రోబోలా కాకుండా అచ్చం నిజమైన వ్యక్తిలా మాట్లాడుతున్నాయి. ప్రస్తుతం అమెజాన్ అలెక్సా అమితాబ్ బచ్చన్ వంటి అనేక మంది సెలబ్రిటీల వాయిస్‌ను మిమిక్రీ చేస్తూ యూజర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. తాజాగా అలెక్సా సాధారణ వ్యక్తులను కూడా అనుకరించే ఫీచర్‌ను అప్‌డేట్ చేసేందుకు అమెజాన్ సిద్ధమైంది. చనిపోయిన వారి గొంతును కూడా అలెక్సా అనుకరించేలా అమెజాన్ కొత్త టెక్నాలజీని ప్రవేశ పెడుతోంది.

లాస్‌వెగాస్‌లో 2022జూన్ 21 నుంచి 24 వరకు జరిగిన అమెజాన్ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( ai) , మెషిన్ లెర్నింగ్ (ml) సదస్సులో అమెజాన్ అలెక్సా ఏఐ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ , ప్రధాన శాస్త్రవేత్త రోహిత్ ప్రసాద్ డెమో ప్రదర్శించారు. ఈ డెమోలో అలెక్సా డివైజ్ చనిపోయిన వ్యక్తి వాయిస్‌ను అద్భుతంగా మిమిక్రీ చేసింది. ఈ డెమో ప్రదర్శించడానికి ఒక చిన్న పిల్లాడు, చనిపోయిన అతని అమ్మమ్మ వాయిస్ శాంపిల్‌ను అమెజాన్ ఉపయోగించింది. ఈ డెమోలో ఆ పిల్లవాడు అమ్మమ్మ గొంతులో ది విజార్డ్ oz వినిపించాలని అలెక్సాని కోరాడు. అప్పుడు అలెక్సా సరే అని అమ్మమ్మ గొంతులో ఆ నవల చదివి వినిపించింది. చనిపోయిన వారి వాయిస్ మళ్లీ వింటుంటే ఒక మధురాతి మధురమైన అనుభూతి కలిగించిందని , ఇది అద్భుతమైన ఫీచర్లు అని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అమెజాన్ అలెక్సా ఒక స్మార్ట్ డివైజ్. వర్చువల్ వాయిస్ అసిస్టెన్స్ డివైజ్‌గా దీన్ని ఉపయోగిస్తున్నారు. యూజర్ల ప్రశ్నలకు ఈ డివైజ్ చక్కగా సమాధానం చెబుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News