Thursday, April 25, 2024

భవిష్యత్ విద్యావిధానం ఇండియాలోనే రూపొందిస్తున్నాం: మోడీ

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్(గుజరాత్): కొత్త జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపి) ద్వారా భవిష్యత్ విద్యావిధానాన్ని దేశంలో తొలిసారి రూపొందించడం జరిగిందని ప్రధాని మోడీ అన్నారు. రాజ్‌కోట్‌లో శ్రీ స్వామినారాయణ్ గురుకుల్‌లో 75వ ‘అమృత్ మహోత్సవ్’ లో వీడియో లింక్ ద్వారా ఆయన ప్రసంగించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 తర్వాత దేశంలో ఐఐటిలు, ఐఐఎంలు, మెడికల్ కాలేజ్‌లు చాలా వరకు పెరిగాయన్నారు.

“భారత్‌కు ఓ ఉజ్వల భవిష్యత్ ఉంది. మన విద్యావిధానం, విద్యా సంస్థలు ఓ పెద్ద భూమికను నిర్వహించనున్నాయి. ఈ స్వాతంత్య్ర ‘అమృత్ కాల్’లో, మన విద్యా మౌలికవసతి, విద్యావిధానం వేగంగా, విస్తృతంగా ఎదగనున్నది, నూతన విద్యా విధానం ద్వారా దేశంలో తొలిసారి భవిష్యత్తు దృష్టితో విద్యావిధానాన్ని రూపొందించడం జరుగుతోంది” అని మోడీ అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News