Sunday, May 19, 2024

ఓయూ ప్రొఫెసర్ కాశీం అరెస్ట్…

- Advertisement -
Professor-Kasim
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ కాశీంను గజ్వేల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. విరసం కార్యదర్శిగా ఇటీవలే ఎన్నికైన కాశీంకు మావోయిస్టులతో సంబంధాలున్నాయనే నేపథ్యంలో ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. దాదాపు ఐదు గంటల పాటు సోదాలు జరిగినట్టు సమచారం. ఈ తనిఖీల్లో భాగంగానే కీలకమైన డాక్కుమెంట్లు, హార్ట్ డిస్సులు, కరపత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా, తన భర్తపై కావాలనే అక్రమ కేసులు పెట్టారని కాశీం భార్య అంటోంది. ములుగు పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదేళ్ల కిందట కేసు నమోదు అయినట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే ప్రొఫెసర్ కాశీం ఇంట్లో సోదాలను విద్యార్థి సంఘాలు ఖండించాయి. ఒయులోని ఖాసి నివాసం ఎదుట విద్యార్థులు ఆందోళనలకు దిగారు.  కాశీం నివాసంలో సోదాలను సిపిఐ నేత నారాయణ ఖండిస్తున్నట్టు తెలిపారు.
Gajwel Police Arrested OU Professor Kasim
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News