Thursday, April 18, 2024

మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై షిరిడీ వాసుల ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

Shirdi

ముంబై: మహారాష్ట్ర సర్కార్ నిర్ణయంపై షిరిడీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రి గ్రామాభివృద్ధికి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే రూ. 100 కోట్లు కేటాయించారు. సిఎం షిరిడీని కాదని పత్రికి నిధులు కేటాయించడంపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో బంద్ పాటించాలని షిరిడీతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. గ్రామస్తుల నిర్ణయంతో తమకు సంబంధం లేదని షిరిడీ ట్రస్ట్ అంటోంది. రేపటి నిరవధికంగా బంద్ పాటించాలని గ్రామస్తుల నిర్ణయం తీసుకున్నారు. అయితే షిరిడీ సాయి ఆలయం తెరిచే ఉంటుదని షిరిడీ ట్రస్ట్ పిఆర్ఒ మోహన్ యాదవ్ స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం షిరిడీ గ్రామస్తులతో ట్రస్ట్ సభ్యలు సమావేశం కానున్నారు. స్థానిక లోకల్ ఎమ్మెల్యే దుర్రానీ అబ్దుల్ ఖాన్ సాయి జన్మస్థలం పత్రేనన్నారు. దీంతో శివసేన ప్రభుత్వ నిర్ణయాన్ని బిజెపి తప్పుపడుతోంది.

Shirdi to be closed indefinitely from January 19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News