Saturday, April 27, 2024

తల్లితో అక్రమ సంబంధం.. కుమార్తెకూ వేధింపులు..

- Advertisement -
- Advertisement -

Illegal affair

హైదరాబాద్: నగరంలోని సనత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి దారుణ సంఘటన చోటుచేసుకుంది. అక్రమ సంబంధం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది.  పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… బోరబండకు చెందిన అజయ్ (30) మాదాపూర్‌లోని ఓ కాలేజీలో అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తూ… ఎస్సార్‌నగర్‌లో హాస్టల్ నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మూసాపేటకు చెందిన మహిళతో పరిచయం పెంచుకుని అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు.

అంతటితో ఆగకుండా ఆమె కూతురిని కూడా వేధించడం ప్రారంభించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. శుక్రవారం సాయంత్రం మహిళ బంధువులు  బోరబండలోని అజయ్ ఇంటికి వెళ్లి తీవ్రంగా కొట్టారు. గాయపడిన అతడిని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. తీవ్రంగా గాయపడిన అజయ్‌ను చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించారు. చికిత్స పొందుతూ అజయ్ మృతి చెందినట్టు డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘటనపై  కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Illegal Relationship with woman Harassment of daughter

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News