Tuesday, April 23, 2024

మిస్టరీ మర్డర్ కేసును ఛేదించిన గజ్వేల్ పోలీసులు

- Advertisement -
- Advertisement -

గజ్వేల్: సిద్దిపేట  జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో ఇటీవల జరిగిన కామల్ల చిన సత్తయ్య(42)హత్య కేసులో బుధవారం ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు గజ్వేల్ ఎసిపి రమేష్ తెలిపారు. ఈ కేసులో మొత్తం 8 మంది నిందితులకు గాను ఒకరు పరారీలో ఉన్నాడని ఆయన చెప్పారు. గజ్వేల్ ప్రాంతంలో సంచలనం సృష్టించిన ఈ హత్య కేసు పూర్వాపరాలను ఆయన బుధవారం రాత్రి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు. జాలిగామ గ్రామానికి చెందిన కామల్ల చిన సత్తయ్యకు పెద్ద సత్తయ్యకు మధ్య గత 7 సంవత్సరాలుగా భూమి తగాదాలు ఉన్నాయని, ఈ నేపధ్యంలోనే చిన్న సత్తయ్య హత్య జరిగిందని ఆయన తెలిపారు.

ఈ సంఘటనలో ప్రధాన నిందితుడు కామల్ల పెద్ద సత్తయ్య చిన్న సత్తయ్యపై పగ పెంచుకుని అతన్ని హత మార్చటానికి నిర్ణయించుకున్నాడు. ఇందుకు గాను తన బంధువు అయని దుర్గాప్రసాద్‌తో రూ.9లక్షలకు సుపారి మాట్లాడుకుని రూ.5వేలు అడ్వాన్సుగా ఇచ్చినట్లు ఆయన చెప్పారు. ఆ తర్వాత హత్య చేయటానికి ఒప్పుకున్న దుర్గాప్రసాద్ తన అనుచరులైన కామల్ల నాగులు, బీరయ్య,శేరిపల్లి గ్రామానికి చెందిన గట్ల ఐలయ్య,కామల్ల పెద్ద సత్తయ్య,అతని బామరిది అయిన తుప్పతి రమేష్‌లతో కలిసి రెండు సార్లు సమావేశమై హత్యకు పథక రచన చేశారని చెప్పారు. ఈ నెల 23న బాలకిషన్,అతని మిత్రుడు నిరంజన్‌ దాస్‌ను గజ్వేల్‌కు పిలిపించుకుని నేరస్తుడు సత్తయ్య, ప్రసాద్ లు సాయంత్రం కలుసుకుని బాగా మద్యం సేవించి ఇనుప రాడ్లు, కమ్మకత్తి తీసుకుని జాలిగామ గ్రామంలో ఆరు బయట నిద్రిస్తున్న కామల్ల చిన సత్తయ్యపై అదే రోజు అర్ధరాత్రి ప్రసాద్, బాలకిషన్, నిరంజన్‌లు విచక్షణా రహితంగా అతి కిరాతంగా దాడిచేసి చంపేసి పారిపోయారని ఎసిపి రమేష్ వివరించారు.

తమకు అందిన ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో నిందితులను పట్టుకుని విచారించినపుడు తాము చేసిన హత్యానేరాన్ని అంగీకరించారని ఎసిపి తెలిపారు.ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు ఆయన అన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన దుర్గా ప్రసాద్ పరారీలో ఉన్నాడన్నారు. త్వరలోనే అతన్ని పట్టుకుంటామని అన్నారు. సంచలనం కలిగించిన జాలిగామ హత్య కేసును ఎసిపి రమేష్, సిఐ వీరప్రసాద్, ఎస్‌ఐ నరేష్‌ల ఆధ్వర్యంలో క్రైం పోలీసు బృందంలోని చిందం సుబాష్, దుంపల పల్లి యాదగిరి, రామొల్ల వెంకటేష్, సిల్వేరి రవిలు ఒక టీం గా ఏర్పడి చాకచక్యంగా మిస్టరీ మర్డర్‌ను ఛేదించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి కేసును చేదించిన పోలీసు బృందాన్ని సిద్దిపేట జిల్లా పోలీసు కమీషనర్ శ్వేత , గజ్వేల్ ఎసిపి రమేష్‌లు ప్రత్యేకంగా అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News