Saturday, April 27, 2024

గల్లీ సౌండుల్లో లిరికల్ వీడియో విడుదల…

- Advertisement -
- Advertisement -

మాచో స్టార్ గోపీచంద్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ’భీమా’ టీజర్ సినిమాపై భారీ అంచనాలను సృష్టించింది. గోపీచంద్, మాళవిక శర్మల అందమైన కెమిస్ట్రీని చూపించిన ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఎ హర్ష దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్ బ్యానర్‌పై కెకె రాధామోహన్ లావిష్ గా నిర్మించిన ఈ చిత్రం సెకండ్ సింగిల్ గల్లీ సౌండుల్లో పాటని విడుదల చేశారు. లైవ్లీ కంపోజిషన్‌కు పేరుపొందిన రవి బస్రూర్ గూస్‌బంప్స్ తెప్పించే మాసీవ్ ట్రాక్‌ని స్కోర్ చేశారు. గోపీచంద్ పాత్ర గురించి చెప్పే టైటిల్ ట్రాక్ ఇది. తను నేరస్తులను భయపెట్టే ఆరోగెంట్ పోలీసు.

సంతోష్ వెంకీ వోకల్స్ పాటలోని ఎనర్జీని పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేశాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… కంపోజర్ రవి బస్రూర్, సింగర్ సంతోష్ వెంకీ కలిసి ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు. అద్భుతమైన కంపోజిషన్, సాహిత్యం, పవర్‌ఫుల్ వోకల్స్‌తో ఈ పాట మాస్‌ని అలరిస్తోంది. ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ’భీమా’ చిత్రం మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8న విడుదలకు సిద్ధమవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News