Tuesday, April 30, 2024

‘కంగువ’ డబ్బింగ్ వర్క్ షురూ

- Advertisement -
- Advertisement -

నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రతిష్టాత్మక మూవీ ’కంగువ’. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తోన్న ’కంగువ’లో బాబీ డియోల్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. తాజాగా ‘కంగువ’ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ వర్క్‌ను ప్రారంభించారు హీరో సూర్య.

డబ్బింగ్ వర్క్ జరుగుతున్న అద్నాన్ ఆర్ట్స్ స్టూడియోస్‌లో హీరో సూర్యతో డైరెక్టర్ శివ, ఇతర టెక్నీషియన్స్ ఫొటో తీసుకున్నారు. పాన్ వరల్డ్ మూవీగా మొత్తం పది భాషల్లో తెరకెక్కుతున్న ’కంగువ’ హీరో సూర్య కెరీర్‌లో హై బడ్జెట్ మూవీగా రూపొందుతోంది. ఈ మూవీ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఒక స్పెషల్ ఫిల్మ్ కాబోతోంది. త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News