Wednesday, November 13, 2024

మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ‘గేమ్ చేంజర్’ టీజర్ వచ్చేస్తోంది..

- Advertisement -
- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమా టీజర్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ మేకర్స్ ఇదివరకే సాంగ్స్ ఇచ్చి ఫ్యాన్స్‌కి మంచి కిక్ ఇచ్చారు. ఇక టీజర్ లేదా నెకస్ట్ సాంగ్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కి మేకర్స్ ఇపుడు అప్డేట్‌ని ఇచ్చేసారు. ఈ సినిమా టీజర్‌ని అతి త్వరలోనే రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. అలాగే చరణ్‌పై అదిరే పోస్టర్‌ను విడుదల చేశారు.

ఇందులో చరణ్ కలెక్టర్ లుక్‌లో కనిపిస్తున్నాడు. అలాగే తనకి ఎదురుగా చాలా మంది పరిగెత్తుకుని రావడం కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఫ్యాన్స్‌కి కావాల్సిన అప్డేట్స్‌తో ట్రీట్‌ని మేకర్స్ అందిస్తున్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ఎస్‌జె సూర్య, శ్రీకాంత్, సునీల్, రవిబాబు తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News