Friday, May 2, 2025

చిరంజీవిని కలిసిన గంటా శ్రీనివాసరావు

- Advertisement -
- Advertisement -

Ganta Srinivasa Rao met Megastar Chiranjeevi

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ సభ్యుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ భేటీలో వీరిద్దరూ పలు అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. ప్రస్తుత రాజకీయ వాతావరణంపై దృష్టి సారించే సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ భేటీ ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుని తెలుగు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వీరి భేటీకి గల కారణాలేమిటనే దానిపై క్లారిటీ లేదు. ప్రజారాజ్యం పార్టీ మాజీ నేత గంటా శ్రీనివాస్ మామూలుగా కలిశారా? లేక చిరంజీవిని కలవడానికి రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే తాజాగా చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్‌’ మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో చిరంజీవిని అభినందించేందుకు గంటా శ్రీనివాసరావు వచ్చారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News