Saturday, June 15, 2024

గ్యాస్ సిలిండర్ ఆటో బొల్తా..తప్పిన పెను ప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గ్యాస్ సిలిండర్ల లోడ్ తో వెళ్తున్న ఆటో బోల్తా పడిన ఘటన హైదరాబాద్ లోని లంగర్ హౌస్ పరిధిలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. టిప్పుఖాన్ పూల్ వద్ద ఆటో బోల్తాపడంతో సిలిండర్లు రోడ్డుపై పడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయింది. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటన స్థలికి చేరుకొని రోడ్డుపై పడ్డ సిలిండర్లను, ఆటోని తొలగించి ట్రాఫిక్ కి అంతరాయం కలగకుండా చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆటో డ్రైవర్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News