Friday, April 26, 2024

రైతుబంధు నిధులు రూ.426.69 కోట్లు విడుదల

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: 1,87,847 మంది రైతుల ఖాతాలలో రైతుబంధు నిధులు జమ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆదివారం నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 8 లక్షల 53 వేల 409.25 ఎకరాలకు నిధులు విడుదల చేశామని, ఇప్పటి వరకు మొత్తం 56 లక్షల 58 వేల 484 మంది రైతుల ఖాతాలలో రూ.4754.64 కోట్లు జమ చేశామని వెల్లడించారు. ప్రతి రైతుకు రైతుబంధు సాయం .. పదో విడత రైతుబంధును విజయవంతంగా పూర్తిచేస్తామన్నారు. వ్యవసాయం లాభసాటి కావాలన్నదే ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్ష అని, కరోనా ఇబ్బందులున్నా రైతుబంధు నిధులు పంపిణీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రతి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వంద శాతం కొనుగోళ్లు చేపట్టిన ఘనత కెసిఆర్ కు దక్కుతుందని, ప్రతి సారి రైతుబంధు పథకం నిధులు విడుదల చేసే ముందు, ప్రతి ఏటా ధాన్యం కొనుగోలు సమయంలో విపక్షాలు ప్రభుత్వం మీద బురదజల్లడం ఫ్యాషన్ గా మారిందన్నారు. ఒక సెక్షన్ మీడియా లక్ష్యంగా పెట్టకొని ప్రభుత్వంపై వ్యతిరేక కథనాలు రాస్తుందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు అన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News