Friday, September 20, 2024

ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. హైదరాబాద్ వాసులకు GHMC అలర్ట్

- Advertisement -
- Advertisement -

భారీ వర్షాలు కురుస్తుండటంతో హైదరాబాద్ నగర వాసులకు జీహెచ్ఎంసి అధికారులు అలర్ట్ జారీ చేశారు. బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో హైదరాబాద్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జీహెచ్ఎంసి అలర్ట్ మెసేజులు పంపుతోంది.

నాలాలు, చెరువులు, లోతట్టు ప్రాంతాల వద్దకు వెళ్లొద్దని నగరవాసులను హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేసింది. ఎమర్జెన్సీ ఉంటటే 040 21111111, 9000113667కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించింది.  కాగా, రాష్ట్రంలో ఇవాళ, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాక వెల్లడించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News