Saturday, September 14, 2024

ఆజాద్ అద్భుత ఆధ్యాత్మికత!

- Advertisement -
- Advertisement -

మొదట కశ్మీర్‌లో బుద్ధిజం రాజ్యమేలింది. 9వ శతాబ్దంలో దాని స్థానాన్ని శైవమతం ఆక్రమించింది. భారత ఉపఖండంలోనే ఆది శంకరుడు బౌద్ధ, జైనాలను నాశనం చేసి శైవాన్ని విస్తరించారు. 14వ శతాబ్దం మొదట్లో ముస్లిం సూఫీ మత బోధకుడు మీర్ సయీద్ అలి షా హందాని కశ్మీరీలను ముస్లింలుగా మార్చాడు. 13, 15 శతాబ్దాలలో కశ్మీర్‌లో ఇస్లాం స్థిరపడింది. శైవం తగ్గింది. 1339లో షా మీర్ కశ్మీర్ మొదటి ముస్లిం పాలకుడయ్యాడు. షా మీర్ వంశం మొదలయింది. అరబ్ వ్యాపారులు ప్రపంచమంతా ఇస్లాంను ప్రచారం చేశారు. లక్షద్వీప్‌లో ఉబయిదుల్లా ప్రస్తుత శకం 661లో ఈ ద్వీపాల ప్రజలకు ఇస్లాం బోధించారు. సమాఖ్య స్వభావం లేని నేటి కేంద్ర ప్రభుత్వం పాలకుల ఆధారంగా బిజెపియేతర రాష్ట్రాలను మతీకరించింది. ఉదాహరణకు తమిళనాడు ద్రవిడ, కేరళ ముస్లిం, ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ మత ప్రభుత్వాలుగా నిందలు మోస్తున్నాయి. నేటి వైదికవాద పాలకులు మతాన్ని, రాజ్యాన్ని కలిపారు.

మెజారిటీ ఇండియా ముస్లింలు హిందు మతం మార్చుకున్నవారే. కశ్మీర్ పండితులు ముస్లింలుగా మారారు. ఇస్లాం 1500 ఏళ్ల క్రితం వచ్చింది. హిందుమతం చాలా పాతది. 10-20% ముస్లింలు బయటివారు. కొందరు మొఘల్ సైనికులు. రాజకీయలబ్ధికి మతాన్ని వాడరాదు. అలా చేసేవారు బలహీనులు అని ప్రజాస్వామ్య ప్రగతిశీల ఆజాద్ పార్టీ నాయకుడు గులాం నబి ఆజాద్ కశ్మీర్ దోద జిల్లాలో వివరించారు. ఈ కాంగ్రెస్ మాజీ నాయకుడు జమ్మూ-కశ్మీర్ 7వ ముఖ్యమంత్రి, కేంద్ర ఆరోగ్య మంత్రి. మోడీ ప్రభుత్వం ఈయనకు 2022లో పద్మభూషణ్‌తో పురస్కరించింది.

తన వ్యాఖ్యానం హిందు- ముస్లిం ఐక్యతకేనని ఆజాద్ వివరించారు. రాజకీయ లబ్ధికి మోడీ ఈయనకు రాజ్యసభలో కన్నీటి వీడ్కోలు ఇచ్చారు. కశ్మీర్ రాజకీయ రాణింపుకి ఆజాద్ ఉభయ మతస్థుల చరిత్రను తడిమారు. ఆజాద్ ఆధ్యాత్మికతతో సంఘీయులు రెచ్చిపోయారు. ముస్లిం నేత అసదుద్దీన్ ఒవైసి ముత్తాత బ్రాహ్మణ తులసిరాందాస్ అని సామాజిక మాధ్యమాల్లో మంటపెట్టారు. 2017లో బిజెపి ఎంపి రాకేశ్ సిన్హా బ్రాహ్మణుడైన ఒవైసి ముని ముత్తాత ముస్లింగా మారాడన్నారు. దీనికి స్పందిస్తూ ఒవైసి నా ముని ముత్తాతలనే కాదు, సిన్హా ముని ముత్తాతలనూ ప్రవక్త ఆదమ్ పుట్టించాడన్నారు.

కోట్ల ఏళ్ల క్రితం విశ్వంలో ప్రాణులు లేవు. అనుకూల పరిస్థితుల్లో జీవ పదార్థం ఉద్భవించింది. ఏకకణ జీవులు పుట్టాయి. ఇవి బహుకణ జీవులుగా ఎదిగాయి. ద్వివిభజనతో అలైంగిక జీవ పునరుత్పత్తి జరిగింది. జీవ పరిణామంలో జీవులకు అవసరమైన అవయవాలు ఏర్పడ్డాయి. వివిధ ప్రాంతాల వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా వివిధ రకాల ప్రాణులు, పశుపక్ష్యాదులు పరిణమించాయి. విభిన్న వాతావరణాల్లో బతకడానికి, శత్రువుల నుండి కాపాడుకోడానికి, పని చేయడానికి అనుకూలంగా 4 కాళ్ళ నరవానరం 2 కాళ్ళు, 2 చేతుల నిటారు నరావతారం ఎత్తింది. క్రమంగా నరుల మెదడు వృద్ధి చెందింది. ఆకలిదప్పులు, శరీర అవసరాలు జీవులన్నిటికీ ఒకటే. పశుపక్ష్యాదుల మెదడు స్థిరంగా ఉంది. వాటికి ఆలోచన, సృజన లేవు. మెదడు అభివృద్ధి చెందిన మనిషి శ్రమను సులభతరం చేసుకున్నాడు.

సృజనశక్తితో కొత్త విషయాలను ఆవిష్కరించాడు. పని ముట్లను, వస్తువులను, యంత్రాలను కనుగొన్నాడు. ఈ స్థితిలోని నరులు కేవలం మనుషులే. తోటి ప్రాణుల కష్టసుఖాలకు స్పందన ప్రతిస్పందనలతో, వారి కష్టాలలో సహకరించే, ఎదుటివారి అభివృద్ధికి ఈర్ష్య పడకుండా అభినందించే, ప్రోత్సహించే, స్త్రీ శిశువులతో సహా మనుషులందరినీ లింగ, కుల, మత, జాతి, ప్రాంత దేశ భేదాలు లేకుండా ప్రేమించే, కలిసిమెలిసి జీవించే మానవులుగా మనుషులు మారాలి.
తన ప్రతిరూపాల జన్మకు కారణం ఆది మానవునికి తెలియదు. తన ప్రతిరూపాన్ని పుట్టిస్తున్న స్త్రీ మహిమాన్వితురాలని, ఆడువారిని ఆదిశక్తులుగా ఆరాధించాడు. క్షేత్ర ప్రధాన సూత్రాన్ని నమ్మాడు. తర్వాత మనిషి పునరుత్పత్తికి పురుషుడూ కారణమని తెలిసింది. బీజ ప్రాధాన్యత ఉనికిలోకి వచ్చింది. పురుష ప్రాధాన్యత, అహం, ఆధిపత్యం పెరిగాయి. ఆడువారి అణచివేత మొదలయింది.

ఒక గుంపుగా నివసిస్తున్న అంటే ఒకే సమూహంలోని స్త్రీ పురుషుల మధ్య ఆయాచిత లైంగిక ప్రక్రియతో సంతానం కలిగేది. కాలక్రమేణా వివిధ సమూహాల మధ్య సంబంధాలు పెరిగాయి. సమూహ అంతర్గత సంపర్కాలతో పాటు అంతర సమూహ సంపర్కాలు జరిగాయి. స్వయం సంపర్కంతో పుట్టిన పిల్లల కంటే పర సంపర్కంతో పుట్టిన పిల్లలు దృఢంగా, ఆరోగ్యంగా ఉండేవారు. క్రమేపీ పర సంపర్కాలు పెరిగాయి. తర్వాత ఎవరి పిల్లలు ఎవరో తెలిస్తే బాగుండుననిపించింది. ముందు ఒకే గుంపులో స్త్రీ పురుషులు, తర్వాత పొరుగు గుంపుల్లోని ఆడామగా పెళ్ళి చేసుకున్నారు. వైవాహిక వ్యవస్థ స్థిరపడింది. వృత్తి కులాలు, వైదికవాద మతాలు ఏర్పడ్డాయి. ప్రస్తుత శకం 610కి ముందు ఇస్లాం లేదు. 2 వేల ఏళ్ల క్రితం క్రైస్తవం లేదు. 4 వేల ఏళ్ల క్రితం వైదికం(హిందుమతం) లేదు. ఇంకా వెనక్కుపోతే ఆది మానవునికి అంటే పురాతన ప్రపంచంలో మతమే లేదు.

మొదట కశ్మీర్‌లో బుద్ధిజం రాజ్యమేలింది. 9వ శతాబ్దంలో దాని స్థానాన్ని శైవమతం ఆక్రమించింది. భారత ఉపఖండంలోనే ఆది శంకరుడు బౌద్ధ, జైనాలను నాశనం చేసి శైవాన్ని విస్తరించారు. 14వ శతాబ్దం మొదట్లో ముస్లిం సూఫీ మత బోధకుడు మీర్ సయీద్ అలి షా హందాని కశ్మీరీలను ముస్లింలుగా మార్చాడు. 13, 15 శతాబ్దాలలో కశ్మీర్‌లో ఇస్లాంస్థిరపడింది. శైవం తగ్గింది. 1339లో షా మీర్ కశ్మీర్ మొదటి ముస్లిం పాలకుడయ్యాడు. షామీర్ వంశం మొదలయింది. అరబ్ వ్యాపారులు ప్రపంచమంతా ఇస్లాంను ప్రచారం చేశారు. లక్షద్వీప్‌లో ఉబయిదుల్లా ప్రస్తుత శకం 661లో ఈ ద్వీపాల ప్రజలకు ఇస్లాం బోధించారు. సమాఖ్య స్వభావం లేని నేటి కేంద్ర ప్రభుత్వం పాలకుల ఆధారంగా బిజెపియేతర రాష్ట్రాలను మతీకరించింది. ఉదాహరణకు తమిళనాడు ద్రవిడ, కేరళ ముస్లిం, ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ మత ప్రభుత్వాలుగా నిందలు మోస్తున్నాయి. నేటి వైదికవాద పాలకులు మతాన్ని, రాజ్యాన్ని కలిపారు.

ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలన్నిటిని మత సంస్థలుగా మార్చారు. ఈ మత ఫాసిస్టు పాలన మారినా వాళ్ళు ప్రజలకు ఎక్కించిన మతోన్మాదం పోదు. ఇతర పెట్టుబడిదారీ పార్టీలన్నీ తరతమ భేదాలతో వైదిక మతాన్ని ఆచరిస్తున్నాయి. రాబోయే పాలకులు కూడా వైదికవాద పిచ్చిని, మెజారిటి మత బుజ్జగింపును కొనసాగిస్తారు. జెండాలు ఎగరేయడం, కర్రలు, కత్తులు తిప్పడం, ‘ఇతరులను’ చంపడం, ఫలానా మతస్థులే దేశంలో ఉండాలనడం దేశభక్తి కాదు.

ప్రజలకు, ప్రత్యేకించి అసహాయ, దళిత, తాడిత పీడిత జనాలకు, అందునా స్త్రీలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వాలను అందించడం, రాజ్యాంగ అమలు దేశభక్తి. ప్రజలు భరత మాత, హైందవ సంస్కృతి, దేవ భాష, మనోభావాలు వంటి భ్రమల భావవాద ఊత పదాలను వదలాలి. భారతీయత పేరుతో పాలకవర్గం చేస్తున్న సంస్కృతీకరణ, హైందవీకరణ, వైదికవాదజాతిగా మార్పు, మత విభజన, తిండి తీర్థాలు, పశు పూజలు, మత నిమ్నజాతులపై దాడులు, ఆహార ప్రక్రియలను అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్య, సమానత్వ, భౌతికవాద భావాలను, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవాలి.

సంగిరెడ్డి హనుమంత రెడ్డి
9490204545

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News