Sunday, June 16, 2024

కుమారుడు పుట్టాడని ప్రియుడికి ఫోన్ చేసి రమ్మని చెప్పిన బాలిక….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కుమారుడు పుట్టాడని ఓ మైనర్ బాలిక తన ప్రియుడికి ఫోన్ చేసి రమ్మని కబురు పంపడంతో ఆమె ఇంటికి అతడు వచ్చాడు. ప్రియుడిపై బాలిక తండ్రి దాడి చేశాడు. దీంతో బాలిక తండ్రి బారి నుంచి తప్పించుకొని రూమ్‌లో వెళ్లి గడియ వేసుకొని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని బండ్లగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….పాతబస్తీలో గౌస్‌నగర్‌లో అబ్దుల్ సోహైల్(25) అనే యువకుడు ఉన్నాడు. సంవత్సరం క్రితం ఓ మైనర్ బాలికతో పరిచయం కావడంతో ప్రేమగా మారింది. ఫిబ్రవరి నెలలో బాలికతో కలిసి యువకుడు పారిపోయారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు సోహైల్ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సోహైల్ జైలు జీవితం గడిపి 15 రోజుల క్రితం విడుదలయ్యారు.

అ విషయం బాలికకు తెలియడంతో ప్రియుడికి ఫోన్ చేసి తనకు కుమారుడు పుట్టాడని రమ్మని అతడికి పలుమార్లు ఫోన్ చేసి చెప్పింది. అతడు ఆమె దగ్గరికి రాకపోయేసరికి మళ్లీ ఫోన్ చేసి రమ్మని కబురు పంపింది. ఆ ఇంట్లో సిసి కెమెరాలు ఉన్నాయని, రావడం కష్టంగా ఉంటుందని అతడు బాలికకు చెప్పాడు. సిసి కెమెరాలు ఆఫ్ చేస్తానని చెప్పడంతో శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలు బాలిక ఇంటికి అతడు వెళ్లాడు. సిసి కెమెరా ఆన్ చేసి వెంటనే సోహైల్‌ను బాలిక తండ్రి పట్టుకున్నాడు. వెంటనే సోహైల్‌ను పట్టుకొని దాడి చేయడంతో తప్పించుకొని ఒక రూమ్‌లో దాక్కొని లాక్ చేసుకున్నాడు. ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు అక్కడికి చేరుకొని వెంటనే అతడిని పట్టుకున్నారు. సోహైల్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. బాలిక తండ్రి పొలిటికల్ లీడర్ కావడంతో సోహైల్‌పై కేసులు పెడుతున్నాని అతడి సోదరి ఆరోపణలు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News