Friday, May 3, 2024

యాదాద్రి థర్మల్‌కు నెలలోగా అనుమతులు ఇవ్వండి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : నల్గొండ జిల్లాలో రూ.35 వేల కోట్లతో నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ ప్లాంట్‌కు పర్యావరణ, అటవీ అనుమతులను నెలలో గా ఇవ్వాలని కేంద్ర పర్యా వరణ,అటవీశాఖకుఎన్‌జిటి (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణ అనుమతులు జాప్యం కావడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని, ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే రూ.20 వేల కోట్లు వ్యయం చేశామని టిఎస్‌జెన్కో ఎన్జీటి దృ ష్టికి తీసుకు వచ్చింది. అన్ని అంశాలను పరిశీలించిన ఎన్జీటీ టివోఆర్ (టర్మ్ ఆఫ్ రిఫెరెన్స్ ) ఇ వ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. ముంబాయికి చెందిన పర్యావరణ వేత్తల అభ్యంతరాలను కొట్టి వేసింది.యాదాద్రి ప్లాంట్ నిర్మాణంపై అనుమతులు ఇవ్వాలని, కేంద్ర పర్యావరణ, అటవీశాఖ కు ఎన్జీటి (చెన్నై) ఆదేశాలు జారీ చేయడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News