Tuesday, May 14, 2024

బుధవారం రాశి ఫలాలు (01-11-2023)

- Advertisement -
- Advertisement -

మేషం – ఆర్థికపరమైన పురోగతి బాగుంటుంది. మీ పేరు ఉన్నత పదవికి సిఫార్సు చేయబడుతుంది. చిన్ననాటి స్నేహితుల వల్ల ముఖ్యమైన విషయాలు తెలుసుకొని లాభపడతారు. కొనుగోలు అమ్మకాల వల్ల లాభపడతారు.

వృషభం – స్త్రీల సహాయసహకారాలు లభిస్తాయి. సేవాసంస్థలకు హితోధిక సహాయం అందిస్తారు. ఉద్యోగంలో చికాకులు సమసిపోతాయి. గతంలో పొదుపు చేసిన ధనం ఇప్పుడు అవసరాలకు ఉపయోగపడుతుంది.

మిథునం – నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. విదేశీయాన వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీ మీద నమ్మకాన్ని గుడ్‌విల్‌ను మరింత బలపరచుకుంటారు. సంతానం కొరకు అధికంగా ఖర్చ చేస్తారు.

కర్కాటకం – ఆర్థిక ప్రయోజనాలు కలిగిన బాటలో మీ ప్రమేయం లేకుండానే పయనిస్తారు. కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ ఎంతోకొంత స్వంత లాభం పొందుతారు.

సింహం – క్రీడారంగాల వారికి ప్రఖ్యాతి లభిస్తుంది. స్వల్ప ఆనారోగ్య సూచన.భూములు కొనుగోలు వ్యవహారాలు అనుకూలిస్తాయి. తనఖా వస్తువులు విడిపిస్తారు. ఆథ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు

కన్య – అనేక అంశాలలో అనుభవం మిమ్మల్ని ముందుకు నడుపుతుంది. స్పెక్యులేషన్‌ లాభిస్తాయి. ఆర్థికపరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఉన్నతాధికారులతో సంబంధాలను బలపరుస్తుంది.

తుల – స్నేహితులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. కుటుంబ పురోభివృద్ధికి విశేషంగా కృషి చేస్తారు. ఆర్ధికంగా కొంత మెరుగు పడుతుంది. వృత్తి-ఉద్యోగ, వ్యాపారాలు మీకు అనుకూలంగానే ఉంటాయి.

వృశ్చికం – జీవితభాగస్వామికి విలువైన బహుమతులు కానుకగా ఇస్తారు. పొదుపు పై దృష్టి సారించి మంచి ఫలితాలు సాధిస్తారు. విద్యా విషయాలకు సంబంధించిన కృషి ఫలిస్తుంది.

ధనున్సు – వ్యాపారంలో రొటేషన్‌ బాగుంటుంది. ఋణాలు తీరుస్తారు.  సెల్ఫ్ డ్రైవింగ్‌ పట్ల అప్రమత్తత అవసరం. నామినేటెడ్‌ పదవులు లభించే సూచనలు గోచరిస్తున్నాయి. ప్రజాసంబంధాలు బలపడతాయి.

మకరం – వృత్తి, ఉద్యోగాల పరంగా అదనంగా బాధ్యతలు నిర్వహించవలసి వస్తుంది. కుటుంబ సమన్యల నుండి బయటపడతారు. ఆరోగ్య పరంగా నలతగా ఉంటుంది. దూరప్రాంత వ్యవహారాలు అనుకూలం. స్వల్ప ధన లాభం.

కుంభం – విదేశీయాన వ్యవహారాలు సానుకూలమవుతాయి. సంఘంలో పేరు ప్రఖ్యాతలు ఇనుమడిస్తాయి. మీపై వైరివర్గం చేసే ప్రచారాలు మీ మీద ఏమాత్రం ప్రభావం చూపవు.

మీనం – ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఇంటర్వ్యూలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఎదురుచూడని అవకాశాలు కలిసి వస్తాయి. వీటిని నేర్పుగా ఉపయోగించుకోండి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News