Friday, May 24, 2024

తెలంగాణలో రాగల అయిదు రోజుల పాటు వడగళ్ళ వానలు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాగల అయిదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో వడగళ్ళ వాన పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయిదు రోజుల పాటు తెలికపాటి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, సూర్యాపేట, వికారాబాద్ , సంగారెడ్డి జిల్లాల్లో వడగళ్ళ వాన పడే అవకాశం ఉందని తెలిపింది. కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మెదక్, కామారెడ్డి, ములుగు, రంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో గంటకు నలభై, యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఒక ప్రకటనలో తెలిపింది. ఈమేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

మంగళవారం రోజున ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్నిసిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నారాయణ పేట, జోగులాంబ గద్వాల, జిల్లల్లో అక్కడక్కడ తేలికపాటి వానలు కురిసే ఛాన్స్ ఉందకి వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రాజన్నసిరిసిల్ల జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురుస్తాయని తెలిపింది. గురు, శుక్ర వారాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిక వర్షం కురియనుంది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయని పేర్కొంది. అత్యధికంగా హన్మకొండ జిల్లా శాయంపేట, ఆత్మకూరు లో 12శాతానికి పైగా వర్షపాతం నమెదయినట్టు వాతావరణ శాఖ తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News