Saturday, March 25, 2023

గో ఫస్ట్ విమానం కోయంబత్తూర్‌కు మళ్లింపు

- Advertisement -

Go First flight diverted to Coimbatore

స్మోక్ అలారంలో లోపం కారణం

కోయంబత్తూర్: బెంగళూరు నుంచి మాలె వెళుతున్న గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాన్ని శుక్రవారం స్మోక్ అలారంలో లోపం ఏర్పడిన కారణంగా కోయంబత్తూర్ విమానాశ్రయానికి మళ్లించారు. 92 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి మాలె వెళుతున్న ఈ విమానానికి చెందిన రెండు ఇంజన్లు వేడెక్కడంతో ఆకాశంలోనే స్మోక్ అలారం మోగడంతో అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని కోయంబత్తూర్‌కు మళ్లించారు. కోయంబత్తూర్ విమానాశ్రయంలో సురక్షితంగా దిగిన విమానాన్ని తనిఖీ చేసిన ఇంజనీర్లు అలారంలో కొద్దిపాటి లోపం ఏర్పడిందని తేల్చారు. విమానంలో ఇతర సాంకేతిక సమస్యలు లేవని వారు నిర్ధారించిన తర్వాత ఆ విమానం మాలెకు బయల్దేరి వెళ్లినట్లు వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News