Monday, May 6, 2024

ముత్యంపల్లి అటవీ శివారులో చిరుతపులి కలకలం

- Advertisement -
- Advertisement -

కాసిపేట: మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని ముత్యంపల్లి అటవీ ప్రాంతం శివారులో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. రెండు రోజుల క్రితం ముత్యంపల్లికి చెందిన రాములు మేకలను అటవీ ప్రాంతానికి మేత నిమిత్తం తీసుకొని వెళ్లగా చిరుతపులి దాడి చేసి రెండు మేకలను చంపింది. ఈ విషయమై రాములు ఫారెస్టు శాఖ అధికారులకు సమాచారం అందించడంతో ఫారెస్టు అధికారులు అటవీ ప్రాంతంలో గాలించగా తల లేకుండా మృతి చెందిన

మేక కనిపించడంతో మేకను చంపింది చిరుతపులిగా అనుమానించి మేకను చంపిన ప్రాంతంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. దీంతో చిరుతపులి మేకను తినేందుకు రాగా అక్కడ ఏర్పాటు చేసిన సిసి కెమెరాలో రికార్డు అయ్యింది. గ్రామాలకు ఆనుకొని అటవీ ప్రాంతం ఉండగా చిరుతపులి గ్రామాల సమీప ప్రాంతానికి వచ్చి మేకలను చం పడంతో గ్రామస్తులు భయందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అటవీ ప్రాంతానికి మేకలు మేపేందుకు కాపరులు , ఇతర అవసరాలకు వెళ్లే గ్రామస్తులు వెళ్లవద్దని ఫారెస్టు అధికారులు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News