Thursday, March 28, 2024

బంగారంతో ఐదేళ్లలో డబ్బు రెట్టింపు

- Advertisement -
- Advertisement -

ఏప్రిల్ 1 నుండి హాల్‌మార్కింగ్ తప్పనిసరి
నాలుగు మార్గాల్లో పెట్టుబడితో మంచి రాబడి

న్యూఢిల్లీ : బంగారం గత ఐదేళ్లలో రెట్టింపు అయింది. 5 సంవత్సరాల క్రితం 10 గ్రాముల బంగారం ధర రూ.31 వేలు ఉండగా, ఇప్పుడు అది రూ. 60 వేలకు చేరింది. అంటే డబ్బు రెట్టింపు అయింది. అంతర్జాతీయంగానూ ఔన్స్ పసిడి రేటు 2000 డాలర్లు దాటింది. గత 10 సంవత్సరాలను పరిశీలిస్తే బంగారం 100 శాతానికి పైగా రాబడిని ఇచ్చింది. గత 1 సంవత్సరంలో బంగారం దాదాపు 15 శాతం రాబడిని ఇచ్చింది. మరోవైపు స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న హెచ్చు తగ్గుల కారణంగా బంగారానికి మద్దతు లభిస్తోందని ఐఐఎఫ్‌ఎల్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా పేర్కొన్నారు. దీంతో ఈ ఏడాది చివరి నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ.65 వేలకు చేరుకోనుందని అంచనా వేస్తున్నారు.

మరోవైపు ఏప్రిల్ 1వ తేదీ నుండి హాల్‌మార్కింగ్ తప్పనిసరి కానుంది, అంటే ఆభరణాల వ్యాపారులు హాల్‌మార్క్ చేసిన బంగారాన్ని మాత్రమే విక్రయించగలరు. ఇప్పుడు బంగారంపై 6 అంకెల ఆల్ఫాన్యూమరిక్ హాల్‌మార్క్ కోడ్ ఉండనుంది. వినియోగదారులు కొనుగోలు చేసే బంగారం స్వచ్ఛమైనదా? కాదా? అనేది దీని ద్వారా తెలుస్తుంది. ఇది ట్రేస్ చేయడం కూడా సులభం అవుతుంది. బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే, ఆభరణాలు లేదా బంగారు బిస్కెట్-, నాణేలు వంటి భౌతిక బంగారమే కాకుండా ఇతర మార్గాల్లో కూడా డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. ఇతర మార్గాల్లోనూ మీ డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది. ఒకవేళ్ల డబ్బు అవసరమైతే మీరు దానిని సులభంగా రుణంగా మలుచుకోవచ్చు లేదా విక్రయించవచ్చు.

గోల్డ్ ఇటిఎఫ్
షేర్ల మాదిరిగా బంగారాన్ని కొనుగోలు చేసే సదుపాయాన్ని గోల్డ్ ఇటిఎఫ్ అంటారు. ఇవి ఎక్స్ఛేంజ్ -ట్రేడెడ్ ఫండ్స్(ఇటిఎఫ్), వీటిని స్టాక్ ఎక్స్ఛేంజీలలో కొనుగోలు చేయవచ్చు, విక్రయించవచ్చు. గోల్డ్ ఇటిఎఫ్ బెంచ్‌మార్క్ స్పాట్ గోల్డ్ ధరల ఆధారంగా ఉంటాయి. కావున మీరు దానిని బంగారం వాస్తవ ధరకు దగ్గరగా కొనుగోలు చేయవచ్చు. గోల్డ్ ఇటిఎఫ్ కొనుగోలు చేయడానికి ట్రేడింగ్ డీమ్యాట్ ఖాతా ఉండాలి. డీమ్యాట్ ఖాతా ద్వారా ఎన్‌ఎస్‌ఇ, బిఎస్‌ఇలో అందుబాటులో ఉన్న గోల్డ్ ఇటిఎఫ్ యూనిట్లను కొనుగోలు చేయవచ్చు. మీ డీమ్యాట్ ఖాతాకు లింక్ చేసిన బ్యాంక్ ఖాతా నుండి సమానమైన మొత్తం తీసివేస్తారు.

పేమెంట్ యాప్‌తో పెట్టుబడి
స్మార్ట్‌ఫోన్ ద్వారా డిజిటల్ బంగారంలో పెట్టుబడి పెట్ట

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News