Saturday, April 20, 2024

నాసా “న్యూమూన్ టు మార్స్‌”కు అధినేతగా భారతీయ సంతతి శాస్త్రవేత్త

- Advertisement -
- Advertisement -

భారత సంతతికి చెందిన సాఫ్ట్‌వేర్ , రొబోటిక్ ఇంజినీర్ అమిత్ క్షత్రియ నాసాకు చెందిన మూన్ టు మార్స్ (చంద్రుడి నుంచి అంగారకుడికి) అనే కొత్త అంతరిక్ష పరిశోధన కార్యక్రమానికి ప్రధమ అధిపతిగా నియామకమయ్యారు. చంద్రుడి తరువాత అంగారకుడిపైకి మానవులు వెళ్లేందుకు వీలుగా చంద్రుడిపై దీర్ఘకాలం ఉండేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనికి నిర్వాహకునిగా అమిత్ క్షత్రియ తక్షణం విధులను చేపడతారు. ఎక్స్‌ప్లొరేషన్ సిస్టమ్స్ డెవలప్‌మెంట్ మిషన్ డైరెక్టరేట్ లో ఈ కొత్త ఆఫీస్ ఏర్పాటైంది.

చంద్రయాత్రలకు సంబంధించి భారీ ఎత్తున సన్నాహాలు చేయడానికి ఈ కొత్త ఆఫీస్ అన్ని విధాలా సహకరిస్తుందని, అలాగే అక్కడ నుంచి అంగారకునిపైకి మొట్టమొదటి సారి మానవులను పంపిస్తుందని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధనలో స్వర్ణయుగం ఇప్పటి నుంచే ప్రారంభమైందని, ఈ కొత్త కార్యాలయం అంగారకునిపై మానవుని తొలి అడుగు పడేందుకు వీలుగా చంద్రునిపై సుదీర్ఘకాలం విజయవంతంగా పరిశోధనలకు ఊతం కల్పిస్తుందని వివరించారు. హార్డ్‌వేర్ డెవలప్‌మెంట్, మిషన్ ఇంటిగ్రేషన్, రిస్క్ మేనేజ్‌మెంట్ ఈ కొత్త కార్యక్రమంలో భాగంగా ఉంటాయి.

అంగారకునిపై మానవ యాత్ర అనే కొత్త తరం పరిశోధనను ప్రారంభించడానికి చంద్రునిపై ఆర్టిమిస్ యాత్రను వినియోగించుకోవడమౌతుందని తెలిపారు. అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలకు సంబంధించి క్షత్రియ తన కెరీర్‌ను 2003లో ప్రారంభించారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా, రొబోటిక్ ఇంజినీర్‌గా, స్పేస్‌క్రాఫ్ట్ ఇంజినీర్‌గా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో రోబోటిక్ అసెంబ్లీపై మొదట దృష్టిని కేంద్రీకరించి పనిచేశారు. ఇప్పుడు చంద్రునిపైన, అంగారకునిపైన యాత్రలకు కార్యక్రమాలు నిర్ణయించే గురుతర బాధ్యత నిర్వహిస్తారు. పసడెనా లోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మేథమెటిక్స్‌లో సైన్స్ డిగ్రీ పొందారు. ఆస్టిన్ లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాన్ నుంచి మేథమెటిక్స్‌లో ఎంఎ చేశారు. విస్కాన్‌సిన్ లోని బ్రూక్‌ఫీల్డ్‌లో ఆయన జన్మించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News