Monday, December 2, 2024

పొన్నాల ఫౌండేషన్ ద్వారా లైబ్రరీ సైన్స్‌లో గోల్డ్ మెడల్

- Advertisement -
- Advertisement -

ఉస్మానియా విశ్వవిద్యాలయం లైబ్రరీ సైన్స్ విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పొన్నాల ఫౌండేషన్ ద్వారా గోల్డ్ మెడల్ ఇచ్చేందుకు ఓయూ పూర్వ విద్యార్థి, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ముందుకు వచ్చారు. ఈ మేరకు ఉప కులపతి ఆచార్య కుమార్ మొలుగారంతో చర్చించి తన ఆసక్తిని ప్రతిపాదించారు. ఓయూ నిబంధనల మేరకు ఐదు లక్షల రూపాయల యాభై వేల రూపాయల చెక్కును బుధవారం అందించారు. నగదు డిపాజిట్ పై వచ్చిన వడ్డీతో ఏటా లైబ్రరీ సైన్స్ విద్యార్థికి బంగారు పతకాన్ని అందిస్తారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కుమార్ పొన్నాల లక్ష్మయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. పూర్వ విద్యార్థిగా విద్యార్థులను ప్రోత్సహించేందుకు తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది స్నాతకోత్సవం నుంచి పొన్నాల పౌండేషన్ తరపున లైబ్రరీ సైన్స్‌లో గోల్డ్ మెడల్ ఇవ్వనున్నట్లు ప్రొఫెసర్ కుమార్ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఓయూలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు చర్చకు వచ్చాయి. ఇందుకు లైబ్రరీ ఆధునికీకరణపై పొన్నాల ఫౌండేషన్ ద్వారా తగిన సహకారం అందిస్తామని పొన్నాల లక్ష్మయ్య హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా లైబ్రరీతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. తాను ఐదవ తరగతి చదువుకునే రోజుల్లో స్వగ్రామం ఖిలాషాపూర్ లో నెలకు ఒక రూపాయి జీతానికి గ్రంథపాలకుడిగా పనిచేసే వాడినని, అప్పుడు తనకు పుస్తకపఠనంపై ఆసక్తి ఏర్పడిందని తన చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. తాను చదువుకున్న విశ్వవిద్యాలయానికి తిరిగి ఏదైనా చేయాలన్న తన ఆలోచనలను పంచుకున్నారు. అంతకుముందు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మెమోరియల్ లైబ్రరీలో ఏర్పాటు చేసిన నేషనల్ లైబ్రరీ వీక్ ముగింపు సందర్భంగా పుస్తక ప్రదర్శనను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఓయూ మెయిన్ లైబ్రరీ ఇంఛార్జ్ లైబ్రేరియన్ డాక్టర్ అచలా మునిగల్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News