Friday, May 3, 2024

వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు శుభవార్త

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు దేశీయ చమరు సంస్థలు శుభవార్త తెలిపాయి. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే 19 కేజీల సిలిండర్ ధరపై రూ.30.50 మేర తగ్గించాయి. తగ్గిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయి. ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.1795 నుంచి 1764.50, ముంబయిలో రూ.1749 నుంచి రూ.1717.50, చెన్నై, హైరదాబాద్, కోల్‌కతాలో వాణిజ్య సిలిండర్ ధరలు తగ్గాయి. స్థానిక పన్నుల ఆధారంగా రాష్ట్రాలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. గృహావసరాలకు వినియోగించే 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. మహిళ దినోత్సవం సందర్భంగా గృహావసరాల గ్యాస్ సిలిండర్ ధర రూ.100 మోడీ ప్రభుత్వం తగ్గించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News