Wednesday, May 1, 2024

ఇరిగేషన్ రంగాన్ని కెసిఆర్ నాశనం చేశారు: ఉత్తమ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతులకు పంట బీమా ఎందుకు కల్పించలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగారు. దేశంలో పంట బీమా కల్పించని ఏకైక ప్రభుత్వం బిఆర్‌ఎస్సేనని ధ్వజమెత్తారు. వరదలు, కరవుతో పంటలు నష్టపోతే రూపాయి ఇవ్వలేదని దుమ్మెత్తిపోశారు. ఒకటి రెండు చోట్లకు కెసిఆర్ వెళ్లి డ్రామాలు చేశాడు కానీ ఒక్క పైసా ఇవ్వలేదన్నారు. ఆదివారం కెసిఆర్ నల్లగొండలో చెప్పినవన్నీ అబద్ధాలేనని దుయ్యబట్టారు. కెసిఆర్‌కు భయం పట్టుకోవడంతో పొలంబాట పట్టారని విమర్శలు గుప్పించారు. బిఆర్‌ఎస్ పదేళ్లలోనే కుప్పకూలిందని మంత్రి ఉత్తమ్ చురకలంటించారు. పార్లమెంటు ఎన్నికల తరువాత బిఆర్‌ఎస్ కనుమరుగుకావడం ఖాయమని జోస్యం చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ పొంకనాలకు పోయి బిఆర్‌ఎస్ పార్టీని నాశనం చేశారని ఎద్దేవా చేశారు.

మైక్ పనిచేయకుంటే పవర్ పోయిందంటూ కెసిఆర్ తప్పుడు మాటలు మాట్లాడారని, పవర్ విషయంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, 24 గంటల పవర్ పాలసీ కొనసాగిస్తున్నామని, నిమిషం పవర్ కట్స్ ఎక్కడా లేవన్నారు.  తెలంగాణ రైతాంగం, ఇరిగేషన్‌ను సర్వనాశనం చేసి వ్యక్తి కెసిఆర్ అని, అందుకు ఆయన సిగ్గుపడాలి, తలదించుకోవాలి, తెలంగాణ జనాలకు క్షమాపణ చెప్పాలని నిలదీశారు. ఇరిగేషన్ రంగాన్ని కెసిఆర్ నాశనం చేయడంతో పాటు దోపిడీ చేశారని ఆరోపణలు. కాళేశ్వరం గురించి మాట్లాడేందుకు కెసిఆర్‌కు సిగ్గుండాలని, కాళేశ్వరంలో కమీషన్ల కోసం అంచనాలు పెంచారని, కళ్ల ముందే కాళేశ్వరం కుంగినా మాట్లాడటం మూర్ఖత్వం కిందకు వస్తుందని ఉత్తమ్ ధ్వజమెత్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News