Monday, November 11, 2024

పట్టాలు తప్పిన గూడ్స్ రైలు

- Advertisement -
- Advertisement -

గూడ్స్ రైలు పట్టాలు తప్పిన ఘటనా మధ్యప్రదేశ్ లోని రత్లామ్ లో గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఢిల్లీ-ముంబయి మార్గంలో పెట్రోలియం ఉత్పత్తులతో వెళ్తుండగా రైల్వే యార్డు సమీపంలో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. రాజ్ కోట్ నుంచి భోపాల్ సమీపంలోని బకానియాలోని భౌరీకి గూడ్స్ రైలు వెళ్తున్నట్లు రత్లామ్ డిఆర్ఎం రజీనీష్ తెలిపారు. ప్రమాదం జరిగిన మార్గంలో రైళ్ల రాకపోకలను పునరుద్ధరిస్తుననామని, కొన్ని రైళ్లు మాత్రం కాస్త ఆలస్యం కావొచ్చని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News