Friday, September 19, 2025

ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమానికి విశేష స్పందన

- Advertisement -
- Advertisement -

ప్రత్యేక ఓటరు నమోదు కార్యాక్రమానికి విశేష స్పందన లభిస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సదాశివనగర్ పోలింగ్ కేంద్రాన్ని ఆయన ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఓటర్లందరు ఖచ్చితమైన వివరాలు ఇచ్చి తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించడానికి సహకరించాలని కోరారు. ఫారం బి వినియోగించి 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు.

ఫారం,8 నింపి ఇంటి చిరునామా మార్పులు సవరణలు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కొత్తగా ఓటర్ గా నమోదు ఇప్పుడు పాలుగు అవకాశాలు కల్పించిందని చెప్పారు. జనవరి 1 ఎప్రిల్ 1, అక్టోబర్ 1 తేదీలను గుర్తుంచుకోవాలని సూచించారు. ఓటరు హెల్ప్ లైన్ యాప్ ద్వారా అర్హత గల వారు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. రికార్డులను ఓటర్ల జాబితాను పరిశీలించారు. బూత్ లెవల్ అధికారులు అందించే సేవలు, ఆధార నమోదు ప్రక్రియ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ వెంకట్రావ్, ఆర్‌ఐ సాహిత్య, బూత్ లెవల్ అధికారులు, నాయకులు వడ్ల రాజెందర్, మద్దెల బాగయ్య తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News