Sunday, May 4, 2025

సన్‌రైజర్స్ పై గుజరాత్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

ఐపిఎల్ 18లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. బ్యాటింగ్ బౌలింగ్‌లలో సమష్టిగా రాణించిన గుజరాత్ 38 పరుగుల తేడా విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. శుభ్‌మన్ గిల్(76), జోస్ బట్లర్(64), సాయి సుదర్శన్(48)లు బ్యాటింగ్‌తో చెలరేగడంతో గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 224 పరగులు చేసింది. అనంతరం లక్ష ఛేదనకు దిగిన సన్‌రైజర్స్ జట్టును గుజరాత్ బౌలర్లు తక్కువ 186/6 పరుగులకే కట్టడి చేశారు. సన్‌రైజర్స్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ(74) తప్ప మరెవరూ రాణించలేక పోయారు. ట్రావీస్ హెడ్(20), హెన్రిచ్ క్లాసెన్(23), నితీశ్ రెడ్డి(20)లు తక్కువ స్కోరుకే ఔటయ్యారు. గుజరాత్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ట రెండేసి వికెట్లు పడగొట్టగా.. ఇశాంత్ శర్మ, కోయెట్జి తలో వికెట్ దక్కించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News