Tuesday, May 14, 2024

గురుకుల టిజిటి ఎంపిక జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

నియామక బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో సెలెక్షన్ లిస్టు
రేపు, ఎల్లుండి హైదరాబాద్‌లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన

మన తెలంగాణ/ హైదరాబాద్ : ఎంతో మంది అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న తెలంగాణ సంక్షేమ గురుకులాల్లో టిజిటి ఉ ద్యోగ పరీక్షల ఫలితాలు వెలువడ్డాయి. ఆదివారం సాయంత్రం ఈ ఫలితాలను గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు అధికారిక వెబ్‌సైట్ లో ఉంచింది. గురుకులాల్లో 4,020 పోస్టులు ట్రైయి న్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ( టిజిటి ) పోస్టులకు గతేడాది ఆగస్టులో రా త పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థులను 1: :2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు ఎంపిక చేసింది. ఈ మేరకు ప్రొవిజినల్ సెలెక్షన్ జాబితాలను విడుదల చేసింది. ప్రొవిజినల్ జాబితాలో ఉన్న హాల్‌టికెట్ నంబర్ కలిగిన అభ్యర్థులకు ఫిబ్రవరి 27, 28 తేదీల్లో హైదరాబాద్‌లో ఈ కింది తేదీల్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు హాజరు కావాలని సూచించింది. సబ్జెక్టుల వారీగా ఎంపికైన జాబితాల కోసం వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News