Friday, July 19, 2024

దానికంటే… పునరాగమనం గొప్పగా ఉండాలి: పాండ్యా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముంబయి ఇండియన్స్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ ను తీసేసి హార్ధిక్ పాండ్యాకు మేనేజ్ మెంట్ అప్పగించింది. దీంతో క్రికెట్ అభిమానులు పాండ్యాను ఘోరంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేశారు. పాండ్యా ముంబయి కెప్టెన్సీ అయిన తరువాత ఆ జట్టు ఐపిఎల్ 2024లో ఘోరంగా ఓటమిని చవిచూసింది. దీంతో పాండ్యా మరింత మానసిక వేదనకు గురయ్యాడు. వెంటనే టి20 వరల్డ్ కప్ ఉండడంతో టీమిండియాలో జట్టులో ఆల్ రౌండర్ గా పాండ్యాను తీసుకున్నారు. టి20 వరల్డ్ కప్ లో పాండ్యా అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ తో అద్భుతంగా రాణించడంతో అందరూ ప్రశంసించారు. టి20 వరల్డ్ కప్ భారత్  గెలవడంతో  జట్టు సభ్యులను ఘనంగా సన్మానించారు. టీమిండియాలో ఉన్న ముంబయి ఇండియన్స్ టీమ్ ఆటగాళ్లను మేనేజ్ మెంట్ ఘనంగా సన్మానించింది. పాండ్యా తన ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన పోస్టు ఇఫ్పుడు వైరల్ గా మారింది. మనకు తగిలిన ఎదురుదెబ్బలకంటే పునరాగమనం గొప్పగా ఉండాలని పోస్టు చేశారు. వెల్ డన్ పాండ్యా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News