Saturday, May 18, 2024

ఆ విషయంలో రాజీనామాకు సిద్ధమా? రేవంత్: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి: పార్లమెంట్ ఎన్నికలలో బిఆర్‌ఎస్‌ను ఎందుకు ఓడించాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలని బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు నిలదీశారు. కాంగ్రెస్ ఓడించడానికి వంద కారణాలు ఉన్నాయని, రేవంత రెడ్డి అంటే మాటల కోతలు… కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలు అని ఎద్దేవా చేశారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లో బిఆర్‌ఎస్ ముఖ్యనాయకులతో హరీష్ రావు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. ఆగస్టు 15 లోపు రూ.39 వేల కోట్లు రుణమాఫీ చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తావా? అంటూ ఛాలెంజ్ చేశారు. రైతు బంధు పూర్తిగా ఇవ్వలేదు కానీ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అంటున్నాడని, కాంగ్రెస్ వారు ఇచ్చిన గ్యారెంటీలే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు భస్మాసురహస్తం చూపిస్తాయని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఓటేయకపోతే పథకాలు బంద్ అవుతాయని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయని, కాంగ్రెస్ అంటేనే కరవు, కరెంట్ కోతలు, మంచినీళ్ల కష్టాలు, అవినీతి అని విమర్శలు గుప్పించారు. 2014 నుంచి 2023 వరకు దేశంలో కాంగ్రెస్‌ ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని, కాంగ్రెస్ పాలన వద్దని ప్రజలు అనుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ నాయకులే రేవంత్ రెడ్డి తమని కలువడం లేదని అంటున్నారన్నారు. రేవంత్ సిఎం పదవిలో ఉండి అర్థం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News