Sunday, September 15, 2024

ఫోన్ మాట్లాడుతూ హీటర్ ఆన్ చేశాడు… ప్రాణాలు గాల్లో కలిశాయి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ పరధ్యానంగా హీటర్ ఆన్ చేయడంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. ఖమ్మం జిల్లా కేంద్రంలోని కాల్వ ఒడ్డునున్న హనుమాన్ దేవాలయం సమీపంలో దోనెపూడి మహేశ్ బాబు(40) కొబ్బరికాయలు అమ్ముతూ జీవన సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఇంట్లో పెంపుడు కుక్కకు స్నానం చేయించేందుకు హీటర్ ఆన్ చేయబోయారు. ఫోన్ రింగ్ కావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతూ హీటర్‌ను చంకలో పెట్టుకున్నాడు. అనంతరం హీటర్‌ను ఆన్ చేయడంతో కరెంట్ షాక్‌తో కిందపడిపోయాడు. కూతురు శభన్య ఇది గమనించి కేకలు వేసింది. ఇరుగుపొరుగు అక్కడికి చేరుకొని హీటర్ స్వీచ్ ఆఫ్ చేసి అపస్మారక స్థితిలోకి పోయిన మహేశ్‌ను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు. మహేశ్‌కు ఇద్దరు కూతుళ్లు, భార్య ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News