Sunday, September 15, 2024

పూరి గన్‌లాంటి వారు: రామ్

- Advertisement -
- Advertisement -

ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డెడ్లీ కాంబినేషన్‌లో మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ గ్రాండ్‌గా నిర్మించిన ఈ సినిమాలో రామ్ పోతినేనికి జోడీగా కావ్య థాపర్ నటించింది. డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో వరంగల్‌లో ‘డబుల్ ఇస్మార్ట్’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో ఉస్తాద్ రామ్ పోతినేని మాట్లాడుతూ.. ‘మణిశర్మ అద్భుతమైన ఆల్బం ఇచ్చారు. ఇస్మార్ట్ శంకర్‌కి మించి చేశారు. స్క్రీన్ మీద చూశాక పాటలు ఇంకా నెక్స్ట్ లెవల్‌కి వెళ్తాయి. సంజయ్ దత్‌తో కలిసి పని చేయడం ఆనందంగా వుంది. ఈ పాత్రని ఆయన తప్పితే మరొకరు చేయలేరు.

కావ్య చాలా మంచి అమ్మాయి. చాలా హార్డ్ వర్క్ చేసింది. పూరి గన్ లాంటి వారు. పేల్చే గన్ బావుంటే బుల్లెట్ ఎంత ఫోర్స్‌గా అయినా వెళ్తుంది. పూరి లాంటి గన్ అందరి యాక్టర్స్‌కి కావాలి. డబుల్ ఇస్మార్ట్‌లో నాది మెంటల్ మాస్ మ్యాడ్ నెస్ క్యారెక్టర్’ అని అన్నారు. డైరెక్టర్ పూరి జగన్నాధ్ మాట్లాడుతూ.. ‘రామ్ పోతినేని లేకపోతే ఇస్మార్ట్ శంకర్ లేడు. సంజయ్ దత్ ఈ సినిమాలో చేయడం కొతదనం తీసుకొచ్చింది. కావ్య, రామ్ పక్కన అద్భుతంగా డ్యాన్స్ చేసింది. ఈనెల 15న రామ్ పోతినేని మిమ్మల్ని ఎంటర్ టైనర్ చేయడానికి రెడీగా వున్నారు’ అని అన్నారు. హీరోయిన్ కావ్య థాపర్ మాట్లాడుతూ.. ‘ఇందులో జన్నత్ లాంటి మంచి క్యారెక్టర్ ఇచ్చిన పూరికి చాలా థాంక్ యూ. రామ్‌తో కలిసిపని చేయడం ఆనందంగా ఉంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఛార్మి, పూరి కనెక్ట్స్ సిఇఒ విష్, అలీ, గెటప్ శ్రీను, టెంపర్ వంశీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News